ETV Bharat / state

హైదరాబాద్​లోని కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 1:56 PM IST

Updated : Nov 3, 2023, 10:13 AM IST

IT Raids on Congress Leaders Houses in Hyderabad : హైదరాబాద్​లో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసీ ఆదేశాలతో.. బడంగ్​పేట్ కాంగ్రెస్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డితో నివాసంతో పాటు, మహేశ్వరం హస్తం పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసం, ఆయన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

IT raids on Congress leaders in Hyderabad
IT raids on Congress leaders in Hyderabad
హైదరాబాద్​లోని కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు

IT Raids on Congress Leaders Houses in Hyderabad : హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids in Telangana)నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మహేశ్వరం హస్తం పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు అదే టికెట్‌ ఆశించిన బడంగపేట్‌ మేయర్‌ పారిజాతా నర్సింహ్మారెడ్డి (Parijatha Narsimha Reddy) ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. వేకువజామున 5 గంటలకే ఆరుగురు సభ్యుల అధికారుల బృందం బాలాపూర్‌లోని పారిజాత ఇంటికి చేరుకుంది.

ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నరసింహారెడ్డి ఇంట్లో లేకపోగా.. దిల్లీ వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారిని వెంటనే రమ్మని కబురు పెట్టిన అధికారులు.. అందరి ఫోన్లు స్వాధీనం చేసుకుని సోదాలు ప్రారంభించారు. స్థిరాస్తి వ్యాపారం చేసే నరసింహారెడ్డి.. సాయంత్రం 5 గంటల సమయంలో తిరిగి వచ్చారు. మేయర్‌ పారిజాతను ఐటీ అధికారులు తిరుపతిలో అదుపులో తీసుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి రెడ్డిభవన్‌కు వచ్చిన ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందన్న కక్షతోనే ఐటీ అధికారులతో దాడులు చేయించారని పారిజాత ఆరోపించారు.

IT Raids in Hyderabad : బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో మూడో రోజూ ఐటీ సోదాలు

బాలాపూర్‌కే చెందిన కాంగ్రెస్‌ నాయకుడు వంగేట లక్ష్మారెడ్డి ఇంటికి కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు వెళ్లారు. ఆయన భార్య గత మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోగా.. లక్ష్మారెడ్డి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు శంకర్‌పల్లి మండలం మాసానిగూడతోపాటు చేవెళ్ల మండలం తంగడపల్లి, శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడలో ఉన్న కాంగ్రెస్‌ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్) (Kichannagari Lakshma Reddy) వ్యవసాయ క్షేత్రాలకు నిన్న ఉదయం 6 గంటలకే అధికారులు చేరుకొని.. సోదాలు ప్రారంభించారు.

Bangalore IT Raid Today : ఎన్నికల ఎఫెక్ట్​.. కార్పొరేటర్ల ఇళ్లల్లో IT సోదాలు​.. మంచం కింద రూ.42 కోట్లు చూసి షాక్​!

IT Raids in Hyderabad Today : ఈ విషయం తెలియడంతో బహదూర్‌గూడ వ్యవసాయ క్షేత్రం వద్దకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ఆందోళనకు దిగగా.. అధికారులు సముదాయించారు. సోదాల సందర్భంగా కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోకాపేటలో నల్గొండ జిల్లా హస్తం పార్టీ నేత బంధువు ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఆయన కూడా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

"మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారనే భయంతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ఈ దాడులు చేయిస్తున్నారు. కేంద్రం సహకారంతో కేసీఆర్‌ కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారు. వీటికి కాంగ్రెస్‌ పార్టీ భయపడదు." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికల హడావుడి నెలకొన్న తరుణంలో నాయకుల ఇళ్లలో ఆకస్మికంగా ఐటీ దాడులు జరగటం చర్చనీయంగా మారింది. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నిర్దిష్టమైన సమాచారం ఆధారంగానే ఆదాయపన్ను అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం

ఫీనిక్స్‌ సంస్థలో ఐటీ సోదాలు, ఏకకాలంలో 20 చోట్ల 30 బృందాల తనిఖీలు

Last Updated : Nov 3, 2023, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.