ETV Bharat / state

Intinta Innovator Telangana : ప్రతిభను వెలికితీసే.. 'ఇంటింటా ఇన్నోవేటర్‌'

author img

By

Published : Jul 24, 2023, 8:56 AM IST

Intinta Innovator in Telangana
Intinta Innovator in Telangana

Intinta Innovator in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇంటింటా ఇన్నోవేటర్‌ ప్రోగ్రామ్‌ నాలుగేళ్లుగా విజయవంతంగా సాగుతోంది. 2019లో ప్రారంభించిన ఆ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న ఆలోచనలు వెలికితీసి ఆవిష్కరణలుగా మార్చి సమాజంలోని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ప్రతి ఏటా జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన ఆవిష్కర్తలు, ఆవిష్కరణలను ఎంపిక చేసి బహుమతులు అందించే కార్యక్రమానికి ఈ ఏడాది ఆగస్టు 5 ఆఖరి తేదీ అని ప్రకటించింది.

ఇంటింటా ఇన్నోవేటర్‌ ప్రోగ్రామ్‌.. ప్రతిభని వెలికితీసేందుకు ప్రభుత్వం చర్యలు

Telangana Intinta Innovator Program 2023 : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగిఉంటుంది. దానిని వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనటమే లక్ష్యంగా అన్నదాతలు, విద్యావేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా ఎవరైనా ఆవిష్కరణలు చేయవచ్చు. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో ప్రయోగాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులను అందజేస్తుంది.

Innovator Program in Telangana : వివిధ వర్గాలకు చెందిన వారిలో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమాన్ని సర్కార్ నిర్వహిస్తోంది. ఏ వృత్తిలో ఉన్నా కొత్త ఆలోచనలు ఉన్నవారు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించారు. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో ప్రయోగాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్న ఆవిష్కర్తలు https://www.teamtsic.org/ వెబ్‌సైట్‌లో ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆవిష్కరణల వివరాలను ఆగస్టు 5వ తేదీలోగా వాట్సాప్‌ 9100678543కి పంపాలి. అందులో ఆవిష్కరణకు సంబంధించి ఆరు వాక్యాలతో వివరణ కూడా ఉండాలి. ఆవిష్కరణకు సంబంధించి ఓ రెండు నిమిషాల వీడియో, నాలుగు ఫొటోలు తీసి పంపాలి. ఆవిష్కరణ పేరు, సెల్‌ఫోన్‌ నంబర్‌, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం/పట్టణం, జిల్లా పేరు రాయాలి.

Intinta Innovator in Telangana : ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న ఆలోచనలను వెలికితీసి.. వాటిని ఆవిష్కరణలుగా మార్చి సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, గృహిణులు, రైతులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఎవరైనా పాల్గ్గొనవచ్చు. రాష్ట్ర జిల్లాస్థాయిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ చొరవను ఆవిష్కర్తలంతా తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలంగాణ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ శాంతా తౌటం కోరారు. సందేహాలు ఉంటే 8328599157 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆవిష్కర్తలు, ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయన్నారు. కార్యక్రమానికి ఆగస్టు 5వ తేదీ వరకు ధరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపిన శాంతా.. 33 జిల్లాల్లోని స్థానిక కలెక్టరేట్‌లో ఆగస్టు 15వ తేదీన ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మన చుట్టుపక్కల, ఇళ్లు, విద్యాలయాలు, వ్యవసాయం, ఇతర సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఆవిష్కరణలు చేయాలన్న శాంతా తౌటం.. ఇప్పటికే ఉన్న వస్తువుల్లో కొన్ని మార్పులు చేర్చి కొత్త వాటిని కూడా రూపొందించవచ్చని అన్నారు. రూపొందించే ఆవిష్కరణ అందరి మెప్పు పొందేలా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఆవిష్కర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.