ETV Bharat / state

CM KCR ON T HUB: ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది: కేసీఆర్‌

author img

By

Published : Jun 28, 2022, 8:41 PM IST

సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కార్పొరేట్‌కు, ఎంటర్‌ప్రెన్యూర్లకు సహాయపడేలా స్టార్టప్ పాలసీ ఉంటుందని తెలిపారు. దేశంలోనే టీహబ్ రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో నిర్మించిన టీహబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

CM KCR ON T HUB
టీ హబ్​ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌

టీహబ్‌ ద్వారా ప్రపంచంలోనే తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్​లో టీహబ్‌ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల క్రితమే అంకురార్పణ జరిగిందని.. 2015లో టీహబ్‌ మొదటి దశ ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలో యువ భారత్‌ సామర్థ్యాన్ని తెలపాలని టీహబ్‌ నెలకొల్పామన్నారు. టీహబ్‌ నేషనల్‌ రోల్‌ మోడల్‌ నిలిచిందన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని, అంకురాల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. ఆటోమొటివ్, ఫార్మా, అగ్రి రంగాల్లో సాంకేతికత అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‌ టాప్‌లో ఉందన్నారు. హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో నిర్మించిన టీహబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

భారత్‌లో స్టార్టప్ ఏకో సిస్టం అభివృద్ధికి కృషిచేస్తున్నాం. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి ప్రభుత్వం చేయూత అందిస్తుంది. కార్పొరేట్‌కు, ఎంటర్‌ప్రెన్యూర్లకు సహాయపడేలా స్టార్టప్ పాలసీ. దేశంలో టీహబ్ రోల్ మోడల్‌గా నిలుస్తుంది. మొదటి దశ టీహబ్ కంటే ఈ సెంటర్‌ ఐదు రెట్లు పెద్దది. మన ఆర్థికవ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయి. అంకురాల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. - కేసీఆర్‌, ముఖ్యమంత్రి

తెలంగాణలో ఐటీ అభివృద్ధికి కేటీఆర్‌ కృషిచేస్తున్నారని ప్రశంసించారు. విద్యాశాఖలో సాంకేతికతకు ఐటీ ప్రతినిధులు సహకారించాలని సీఎం కేసీఆర్ కోరారు. టీ హబ్‌ ద్వారా అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందుతాయని.. దీని ద్వారా తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందన్నారు. టీహబ్‌ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌, జయేశ్‌రంజన్‌కు అభినందనలు తెలిపారు. అంతకు ముందు వేదికపై స్టార్టప్‌ ప్రతినిధులను సీఎం సత్కరించారు. స్టార్టప్‌ వ్యవస్థాపకులను సీఎంకు పరిచయం చేసిన ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌.. ఔత్సాహిక వ్యాపారవేత్తల గుర్తింపు టార్చ్‌ను సీఎంకు అందజేశారు.

ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది: కేసీఆర్‌

ఇవీ చదవండి: హైదరాబాద్​ సిగలో మరో మణిహారం.. కేసీఆర్​ చేతుల మీదుగా టీ-హబ్​ 2.0 ప్రారంభం

రెండున్నరేళ్ల బాలుడ్ని బలిచ్చిన తాంత్రికుడు.. ఆస్తిపై కన్నేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.