ETV Bharat / state

పురపాలకశాఖలో ఇంజినీరింగ్​ పట్టభద్రులకు ఇంటర్న్​షిప్​

author img

By

Published : Oct 8, 2020, 9:00 PM IST

పురపాలకశాఖలో ఇంజినీరింగ్​ పట్టభద్రులకు ఇంటర్న్​షిప్​
పురపాలకశాఖలో ఇంజినీరింగ్​ పట్టభద్రులకు ఇంటర్న్​షిప్​

పట్టణాల్లోని స్థానిక సంస్థలకు సాంకేతిక సహకారం కోసం ఇంజినీరింగ్ పట్టభద్రులను పురపాలకశాఖ వినియోగించుకోనుంది. దీనికోసం నాలుగు నెలలపాటు ఇంటర్న్​షిప్ కింద వారిని తీసుకోనున్నారు. అక్టోబర్​ నుంచి 2021 జనవరి వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల ఇంజినీరింగ్ పట్టభద్రులు ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు.

పట్టణప్రాంత స్థానిక సంస్థలకు సాంకేతిక సహకారాన్ని అందించేందుకు ఇంజినీరింగ్ పట్టభద్రులను పురపాలకశాఖ వినియోగించుకోనుంది. 2021 స్వచ్ఛ సర్వేక్షణ్, చెత్త, బహిర్భూమి రహిత పట్టణాల ధృవీకరణ తదితరాలకు సంబంధించిన సాంకేతిక సహకారం కోసం వారి సేవలను ఉపయోగించుకోనున్నారు. ఇందుకోసం నాలుగు నెలల పాటు ఇంటర్న్​షిప్ కింద వారిని తీసుకోనున్నారు. అక్టోబర్ నుంచి 2021 జనవరి వరకు వారు ఇంటర్న్​షిప్​గా పనిచేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​లోని పురపాలకశాఖ సంచాలకుల కార్యాలయంలో విధులు నిర్వహించాలి. ఎంపికైన విద్యార్థులు సొంత ల్యాప్​టాప్, ఇంటర్నెట్ డాంగుల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల ఇంజినీరింగ్ పట్టభద్రులు ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి: పన్ను ఎగవేతదారులపై పురపాలకశాఖ కొరడా

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.