ETV Bharat / state

న్యూయర్​ స్పెషల్​ - మెట్రో టైమింగ్స్​ పెంపు, లాస్ట్​ ట్రైన్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 5:03 PM IST

Updated : Dec 30, 2023, 5:18 PM IST

Hyderabad Metro
Hyderabad Metro Rail Timings on 31st December

Hyderabad Metro Rail Timings on 31st December : న్యూ ఇయర్​ వేడుకలకు హైదరాబాద్​ మహానగరం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి హైదరాబాద్​ మెట్రో అర్ధ రాత్రి వరకు రైళ్లను పొడిగించింది. చివరి మెట్రో రైలు 12.15 గంటలకు ఉంటుందని మెట్రో ఎండీ ఎన్​ వీఎస్​ రెడ్డి తెలిపారు.

Hyderabad Metro Rail Timings on 31st December : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిసెంబరు 31 అర్ధరాత్రి వరకు మెట్రో రైలు ప్రయాణాన్ని పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్​(Hyderabad Metro) ఎండీ ఎన్​వీఎస్​ రెడ్డి ప్రకటించారు. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటల వరకే చివరి రైలు ఉండగా, డిసెంబరు 31వ తేదీ మాత్రం అర్ధరాత్రి 12.15 గంటలకు చివరి రైలు మొదలవుతుందని చెప్పారు. జనవరి 1వ తేదీన 1 గంటకు ఆ రైలు తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందని మెట్రో ఎండీ వివరించారు.

New year celebrations 2024 : న్యూయర్(New Year Day 2024) సమయంలో మెట్రో ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్​వీఎస్​ రెడ్డి చెప్పారు. మద్యం సేవించి వచ్చినా, తోటి ప్రయాణికుల పట్ల దుర్భాషలాడిన మెట్రో రైలు భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ఆయన ప్రయాణికులను కోరారు.

హైదరాబాద్​లో న్యూయర్​ వేడుకలకు రాచకొండ సీపీ హుకుం - యువత జరభద్రం ఇక

New Year Traffic Restrictions 2024 : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్​ రింగ్​ రోడ్డు(ORR)తో సహా అన్ని ఫ్లై ఓవర్​లను మూసివేస్తున్నట్లు చెప్పారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు తప్ప మిగిలిన వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు మేడ్చల్ డివిజన్ ట్రాఫిక్ డీసీపీ వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో(New Year Celebrations 2024) యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకవేళ మద్యం సేవించి, హెల్మెట్​ లేకుండానియమ నిబంధనలు పాటించకుండా వెళ్లే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరు వాహనం నడపడంలో నిర్లక్ష్యం వహిస్తే మరొకరు ఇబ్బందులు పాలవుతారని డీసీపీ చెప్పారు.

అర్ధరాత్రి ఎవరూ కేక్​లు కట్ట చేయవద్దు : డిసెంబరు 31వ తేదీన 12 బృందాలతో పటిష్ఠమైన డ్రంక్​ అండ్​ డ్రైవ్(Drunk and Drive) తనిఖీలు చేయనున్నట్లు అడిషనల్​ డీసీపీ వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. అర్ధరాత్రి ఎవరైనా కేకులు కట్ చేసినా, టపాసులు పేల్చినా, బైక్​ ర్యాలీలు నిర్వహించినా సీసీ కెమెరా ద్వారా గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు.

న్యూ ఇయర్ రోజు పార్టీ చేసుకుంటున్నారా​ - అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

హైదరాబాద్​లో న్యూయర్​ వేడుకలపై పోలీసుల ఆంక్షలు - రాత్రి 1 గంట వరకే పర్మిషన్

Last Updated :Dec 30, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.