ETV Bharat / sports

IPLలో విరాట్ రికార్డులు- ఏకైక భారత బ్యాటర్​గా కింగ్ ఘనత - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 9:38 AM IST

Virat IPL Records: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ శనివారం చెన్నైతో మ్యాచ్​లో పలు రికార్డులు క్రియేట్ చేశాడు. అవేంటో తెలుసా?

Virat IPL Records
Virat IPL Records (Source: Associated Press)

Virat IPL Records: 2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్​లోకి దూసుకెళ్లింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ దీంతో టోర్నీలో ఇరుజట్లు 7 విజయాలతో ఉన్నప్పటికీ చెన్నై (+0.392) కంటే ఆర్సీబీ (+0.459)రన్​రేట్ ఎక్కువగా ఉండడం వల్ల బెంగళూరు నాకౌట్​కు అర్హత సాధించింది.

అయితే ఈ సీజన్​లో ఆర్సీబీ విజయాల్లో విరాట్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుత సీజన్​లో 14మ్యాచుల్లో 708 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే విరాట్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు 700+ పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు. విరాట్ ఇదివరకు 2016 ఎడిషన్​లో 974 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్​లో నమోదైన పలు రికార్డులు

  • ఈ ఐపీఎల్​ సీజన్​లో ఆర్సీబీ వరుసగా 6మ్యాచ్​ల్లో విజయం సాధించింది. ఓ ఎడిషన్​లో వరుసగా 5+ విజయాలు సాధించడం ఆర్సీబీకి ఇది నాలుగోసారి. గతంలో 2011 (7 విజయాలు), 2009లో (5 విజయాలు), 2016లో (5 విజయాలు) ఈ ఫీట్ నమోదు చేసింది. ఇందులో ప్రతిసారీ ఆర్సీబీ రన్నరప్​గా నిలవడం విశేషం.
  • ఒకే ఐపీఎల్​లో వరుసగా 6 మ్యాచ్​ల్లో ఓటమి, వరుసగా 6మ్యాచ్​ల్లో విజయం నమోదు చేయడం కూడా ఇదే తొలిసారి. ఇది కూడా ఆర్సీబీకే దక్కింది.
  • ఐపీఎల్​లో ఒకే వేదికపై అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్​గా కూడా విరాట్ రికార్డు కొట్టాడు. ఐపీఎల్​ చరిత్రలో విరాట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 3040 పరుగులు నమోదు చేశాడు. సింగిల్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాటే. ఈ లిస్ట్​లో ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 2295 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
  • ఈ సీజన్‌లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ 155.60. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ ఇదే.
  • విరాట్ ఈ సీజన్​లో అత్యధిక సిక్స్​లు బాదిన బ్యాటర్​గా నిలిచాడు. ఇప్పటివరకు 37 సిక్స్​లు బాదాడు. సన్​రైజర్స్​ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (36 సిక్స్​లు) రెండో స్థానంలో ఉన్నాడు.

'విరాట్ మళ్లీ కెప్టెన్ అవ్వాలి- ధోనీలా ఇంపాక్ట్ చూపిస్తాడు!' - IPL 2024

అంపైర్​పై కోహ్లీ మళ్లీ ఫైర్​ - ఈ సారి ఏం జరిగిందంటే? - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.