ETV Bharat / state

Hyderabad gold theft case : మీ సిబ్బంది వివరాలు 'హాక్​ ఐ'లో ఉంచండి.. స్వర్ణకార యజమానులకు పోలీసుల సూచన

author img

By

Published : Aug 3, 2023, 7:34 PM IST

Hyderabad Gold Theft Case
Hyderabad Gold Theft Case

Hyderabad Gold Theft Case : హైదరాబాద్​లోని ఓ గోల్డ్​ షాపులో బంగారు ఆభరణాలతో గతవారం ఉడాయించిన నిందితుడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో చార్మినార్ ఏసీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పసిడి వ్యాపారులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. చోరీలకు కళ్లెం వేయడంలో తెలంగాణ పోలీసులు రూపొందించిన యాప్​లో స్వర్ణకారుల డాటాను నిక్షిప్తం చేసి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

ACP Charminar appeal for gold traders : ఇటీవల జరుగుతున్న బంగారం దొంగతనాల్లో చాలా వరకు ఇంటి దొంగల పనేనని.. వారి కట్టడికి తమతో సహకరించడంలో పోలీస్ శాఖ అందిస్తున్న యాప్​ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర స్వర్ణకార యజమానులకు చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ సూచించారు. గోల్డ్ స్మిత్, గోల్డ్ పాలిష్ వర్కర్లను నియమించుకున్నప్పుడు, వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఉద్యోగుల వివరాలను 'హాక్ ఐ' యాప్‌లో అప్‌లోడ్ చేయాలని.. ఆ తర్వాత మాత్రమే వారిని సంబంధిత పనుల్లో నియమించుకోవాలని ​పసిడి యజమానులకు పోలీసుల తరపున విజ్ఞప్తి చేశారు. అప్పుడే చోరీలకు పుల్​స్టాప్​ పెట్టే అవకాశం ఉంటుందన్నారు.

Gold Jewelry Seized by Hyderabad Police : ఇటీవల హైదరాబాద్​లో సంచలనం సృష్టించిన బంగారు ఆభరణాల ఉడాయింపు కేసును హుస్సేని ఆలం పోలీసులు త్వరితగతిన ఛేదించారు. వైజాగ్​లో నిందితుడిని అరెస్ట్ చేసి.. అతడి నుంచి 38.2 తులాల బంగారం, 1ఎయిర్ పిస్టల్, 1 మొబైల్ ఫోన్, బంగారు ఆభరణాలు కరిగించేందుకు ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

అసలు ఏమి జరిగింది : పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చేలాపురకు చెందిన తారాకాంత్ అనే బంగారు వ్యాపారి తన వద్ద ఓకన్ మాజ్హి అలియాస్ సిరాజ్ అనే వ్యక్తి ఆభరణాల పాలిష్ పనిచేస్తున్నాడు. గత నెల 27వ తేదీన తన షాప్​లో నుంచి 52 తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయాడని హుస్సేని ఆలం పోలీసు స్టేషన్​లో గత నెల 30వ తేదీన తారాకాంత్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో నిందితుడు వైజాగ్ పారిపోయి అక్కడ ఆభరణాలను కరిగించి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు.

ఏసీపీ చార్మినార్ అదేశాల మేరకు హుస్సేని ఆలం ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి నాయకత్వంలో అదనపు ఇన్​స్పెక్టర్ వీరభద్ర కుమార్ నేతృత్వంలో ఒక టీమ్​ను ఏర్పాటు చేశారు. నేర విభాగం బృందం వైజాగ్ చేరుకొని చాకచక్యంగా నిందితున్ని అదుపులోకి తీసుకొన్నారు. అతని దగ్గర నుంచి 38.2 తులాల బంగారం, 1ఎయిర్ పిస్టల్, 1 మొబైల్ ఫోన్, బంగారు ఆభరణాలు కరిగించేందుకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు అపహరించిన 52 తులాల బంగారు అభరణాల్లో 11 నెక్లెస్​లు, 4 బంగారు గాజులు, 1 జత చెవి పోగులు ఉన్నాయి. బంగారు ఆభరణాలలో పొదిగిన రాళ్లను తీసివేసి మిగితా ఆభరణాలను కరిగించగా అది 38 తులాల 2 గ్రాములు బంగారం అయ్యిందని చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ తెలిపారు. కేసును చేధించడమే కాకుండా చాకచక్యంగా వ్యవహరించి నిందితున్ని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.