ETV Bharat / state

CV Anand on Bjp Rally: 'మేం అనుమతి ఇవ్వలేదు.. అవన్నీ అవాస్తవం'

author img

By

Published : Jan 4, 2022, 7:08 PM IST

CV Anand on Bjp Rally: హైదరాబాద్‌లో భాజపా తలపెట్టిన ర్యాలీ తాము అనుమతి ఇవ్వలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా నగరంలో ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతిలేదని తెలిపారు.

CV Anand
CV Anand

CV Anand on Bjp Rally: భాజపా ర్యాలీకి అనుమతి లేదని హైదరాబాద్ సీపీ ఆనంద్ వెల్లడించారు. భాజపా తలపెట్టిన ర్యాలీకి తాము అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ర్యాలీకి అనుమతించామన్న వార్తలు అవాస్తవమని కొట్టిపడేశారు. కొవిడ్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పకడ్బందీగా అమలు చేయాలని పోలీసులకు ఆయన సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.

పక్కాగా కరోనా నిబంధనలు: సీపీ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పకడ్బందీగా అమలు చేయాలి. ప్రతి ఆఫీసులో, పోలీసు స్టేషన్‌లో వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. పార్థనా మందిరాలవద్ద, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూసుకోవాలి. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడి కొవిడ్ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వివరించండి.

-- సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.