ETV Bharat / state

తెలంగాణలో పోలీసుల పటిష్ఠ నిఘా - ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం - ఇప్పటివరకు రూ.737 కోట్ల సొత్తు స్వాధీనం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 7:39 AM IST

Huge Amount Of Money Seized in Telangana Election 2023 : శాసనసభ ఎన్నికల వేళ నోట్ల కట్టలు, ఆభరణాలు, మద్యం భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే.. గత ఎన్నికల రికార్డులను అధిగమించింది. తనిఖీల్లో పట్టుబడ్డ సొత్తు ఇప్పటికే రూ.737 కోట్లు దాటింది. ప్రచారపర్వం ముగిసిన ప్రస్తుత తరుణంలో ప్రలోభాల పర్వంపై ఎన్నికల సంఘం మరింతగా దృష్టి సారించింది.

Telangana Election 2023
Police Seized Rs 737 Crores in Telangana Election 2023

ఎన్నికల్లో ఇప్పటికివరకు రూ.737 కోట్లు స్వాధీనం - గత రికార్డులు తారుమారు

Huge Amount Of Money Seized in Telangana Election 2023 : ఎన్నికల్లో ప్రలోభాలు.. కొన్ని సంవత్సరాలుగా ఈ అంశం తరచూ ప్రస్తావనకు వస్తోంది. తమ పనితీరు, హమీలతో ఓటరు మహాశయుణ్ని ప్రసన్నం చేసుకొని వారి మద్దతు పొందాల్సిన రాజకీయ పార్టీలు, నేతలు.. అక్రమాలపై కన్నేశారు. ఓటర్లు(Voters)ను ప్రలోభ పెట్టడం ద్వారా వారి ఓట్లను రాబట్టుకునే విషయమై దృష్టి సారిస్తోండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నేళ్లుగా చూస్తోంటే ఈ పరిస్థితి పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు రహస్యంగా సాగిన ప్రలోభాల పర్వం.. క్రమంగా బాహాటంగా సాగుతోంది. ఆన్‌లైన్, డిజిటల్ లావాదేవీలు ఆ సంస్కృతి మరింత ఊతమిచ్చాయి.

Police Seized Rs. 737 Crores in Telangana Election 2023 : ఇలా డబ్బులు పంపిణీ చేస్తుంటే ఫిర్యాదు, పట్టించాల్సింది పోయి.. నగదు ఇవ్వడం లేదని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కొంత మంది ఆందోళనలకు దిగిన పరిస్థితులు చూశారు. కొన్నిచోట్ల డబ్బులు ఇవ్వలేదంటూ ఓటింగ్‌కు రాకుండా దూరంగా ఉండేందుకు ప్రయత్నించిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రంలో కొన్నాళ్ల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో ఈ పరిస్థితులు కనిపించాయి.

శాసనసభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఈ ప్రలోభాలపర్వంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశంలోనే ఖరీదైన ఎన్నికలు ఎక్కడంటే తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పే పరిస్థితి వచ్చిందని సాక్షాత్తూ ఈసీ వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. ప్రతి సందర్భంలోనూ మునుగోడు ఉపఎన్నికను కేంద్ర ఎన్నికల కమిషనర్లు ప్రస్తావిస్తుండడం తీవ్రతకు అద్దం పడుతోంది. గత అనుభవాల నేపథ్యంలో అధికారుల వ్యవహారశైలి, పనితీరు పట్ల ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేపదే కర్ణాటక, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు.

ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - గుట్టుగా కార్లలో తరలిస్తున్న 3.2 కోట్ల సొత్తు సీజ్

Police Checking in Telangana Election 2023 : ఎన్నికల సందర్భంగా అక్కడ స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, ఆభరణాలు, కానుకలు పెద్దమొత్తంలో పెరిగాయని.. తెలంగాణలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, హెచ్చరికలతో ముందు నుంచే రాష్ట్రంలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్(Election Schedule) కంటే ముందే 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర సోదాలు చేపట్టారు. అక్టోబర్ 9న ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎక్కడిక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. భారీ ఎత్తున నోట్ల కట్టలు, మద్యం, బంగారం వంటి ఆభరణాలు లభ్యమవుతున్నాయి.

Telangana Assembly Election 2023 : అక్టోబర్ 9 నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు అక్షరాలా రూ.301.93 కోట్లు. అక్రమ సరఫరా ద్వారా పట్టుబడిన మద్యం 2,53,000 లీటర్లు. నగదు, అన్ని వస్తువులు కలిపితే ఇప్పటి వరకు స్వాధీనం అయిన మొత్తం సొత్తు విలువ రూ.737.29 కోట్లు. ప్రచారం ముగిసినందున ప్రలోభాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల డబ్బు, మద్యం పంపిణీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో మరింత అప్రమత్తంగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు.

బస్సులో భారీగా నగదు పట్టివేత.. రూ.1.10 కోట్లు స్వాధీనం

"చెక్​పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని నిశితంగా పోలీసులు తనిఖీ చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్​ వద్దకు వచ్చిన ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నాము. అలాగే ఫ్లైయింగ్​ స్వాడ్స్​ ఈ తంతును నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు రూ.737 కోట్ల సొత్తు దొరికింది. ఇందులో రూ.301 కోట్లు నగదునే ఉంది. రూ.137 కోట్ల లిక్కర్​, డ్రగ్స్​, బంగారు ఆభరణాలు రూ.186 కోట్ల, ఇంకా ఇతరత్రాలు రూ.84 కోట్లు దొరికాయి." - వికాస్ రాజ్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

2018 కన్నా భారీగా నగదు పట్టివేత : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపిణీ చేసే వస్తు సామగ్రిని నిలువరించేందుకు వాణిజ్య పన్నుల శాఖ 240 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. మద్యం అక్రమ సరఫరా కట్టడిపై ఆబ్కారీశాఖ నిఘా పెంచింది. ఇప్పటికే గుడుంబా, నాన్‌ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వస్తున్నట్లుగా గుర్తించిన ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అదే 2018 ఎన్నికల వేళ స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.137.97 కోట్లు మాత్రమే. ఈసారి స్వాధీనాల మొత్తం గత రికార్డును ఎప్పుడో అధిగమించింది.

ప్రలోభాలకు తావులేకుండా విసృత తనిఖీలు - 24 గంటలు నిఘా : సీఈవో వికాస్ రాజ్

రామగుండంలో అకస్మిక తనిఖీలు ­- రూ.2.18 కోట్ల నగదు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.