ETV Bharat / state

ప్రలోభాలకు తావులేకుండా విస్తృత తనిఖీలు - 24 గంటలు నిఘా : సీఈవో వికాస్ రాజ్

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 5:39 PM IST

Updated : Nov 29, 2023, 6:10 AM IST

Telangana CEO Vikas Raj Pressmeet Today : ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు. టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధమన్న సీఈవో.. సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని స్పష్టం చేశారు. ప్రలోభాలకు తావు లేకుండా 24 గంటల పాటు నిఘా ఉంచినట్లు ప్రకటించారు.

Telangana CEO Vikas Raj Pressmeet Today
Telangana CEO Vikas Raj
ప్రలోభాలకు తావులేకుండా విస్తృత తనిఖీలు - 24 గంటలు నిఘా : సీఈవో వికాస్ రాజ్

Telangana CEO Vikas Raj Pressmeet Today : ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధమని స్పష్టం చేశారు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధమని వివరించారు. సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశముంటుందని స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని చెప్పారు.

Telangana Assembly Elections 2023 : ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేశారన్న సీఈవో.. విధుల్లో ఉన్నవారు 1.48 లక్షల మంది ఓటు వేశారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయట కూడా వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 3,803 సెక్టార్లలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఈవో వికాస్ రాజ్ వివరించారు.

ఎన్నికల మెటీరియల్ డిస్ ప్లే చేయరాదని సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వాటిని మీడియాలో చూపరాదని కోరారు. ఒపీనియన్ పోల్స్ ప్రకటించరాదన్న సీఈవో.. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేశారు.అదేవిధంగా బల్క్ ఎస్ఎంఎస్, వాయిస్ ఎస్ఎంఎస్​లు పంపరాదని సూచించారు. రాష్ట్రంలో స్థానికేతల ఓటర్లు ఉండరాదని.. వారు వెంటనే వెళ్లిపోవాలని చెప్పారు. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలించడానికి పార్టీలు, అభ్యర్థులు రవాణా సదుపాయం ఏర్పాటు చేయరాదని తెలిపారు.

Telangana CEO Vikasraj Interview : 'ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లు తొలగిస్తాం'

ప్రలోభాలకు తావులేకుండా విసృత తనిఖీలు : ప్రలోభాలు అరికట్టడం చాలా కీలకమని.. ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సీఈవో వికాస్​ రాజ్ తెలిపారు. 24 గంటల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థికి ఒకటి, ఏజెంట్​కు ఒకటి, కార్యకర్తలకు ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని చెప్పారు. పోలింగ్ తర్వాత అవసరమైతే అభ్యర్థుల తరఫువారు ఈవీఎం వాహనాలను ఫాలో చేయవచ్చని పేర్కొన్నారు. ఏజెంట్లు ఉదయం 5.30కి వచ్చేయాలని తెలిపారు. గచ్చబౌలి స్టేడియంలో పోస్టల్ బ్యాలెట్ ఎక్సెంజ్ సెంటర్ నడుస్తోందని వెల్లడించారు.

'ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దు. టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం. సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు. మొత్తం 3,803 సెక్టార్లలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు. పోలింగ్‌ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధం. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.737 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం.' -వికాస్ రాజ్, తెలంగాణ సీఈవో

ప్రతి రూట్​కు నిర్దేశిత మార్గం, ఆ మార్గాన్ని డీవియెట్ చేయరాదని వాహనాల్ని ఎక్కడా ఆపరాదని స్పష్టం చేశారు. ఎపిక్ పంపిణీ ఇవాళ పూర్తి, ఎపిక్ లేకపోతే 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పు గుర్తింపు కార్డు కాదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.737 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ.302 నగదు, రూ.125 కోట్ల విలువైన మద్యం, రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.84 కోట్ల విలువైన ఇతర కానుకలు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. 29న కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని.. 144 సెక్షన్ అమల్లో ఉందిని చెప్పారు. ఎక్కడ కూడా ఐదుగురికి మించి గుమికూడరాదని సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు.

పకడ్బందీ చర్యలు, క్షేత్రస్థాయి కార్యాచరణతో ఫిర్యాదులు తగ్గుతూ వస్తున్నాయి : సీఈవో వికాస్​ రాజ్

Last Updated : Nov 29, 2023, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.