ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - గుట్టుగా కార్లలో తరలిస్తున్న 3.2 కోట్ల సొత్తు సీజ్

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 12:23 PM IST

thumbnail

Huge Amount Of Cash Seized in Rangareddy District : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ అక్రమ నగదు రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా రంగారెడ్ది జిల్లాలోని పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్ఆర్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. చౌటుప్పల్ తీసుకెళ్తున్న రెండు కోట్ల రూపాయల నగదును కారులో అధికారులు గుర్తించారు. ఆధారాలు లేని డబ్బు కావడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు సీజ్‌ చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డబ్బుగా ఆ వ్యక్తులు, పోలీసులకు చెబుతున్నప్పటికీ.. సరైన పత్రాలు లేకపోవడంతో లోతుగా విచారిస్తున్నారు.

One Crore Cash Seized At Nacharam Police Station : నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రూ.కోటి ఇరవైలక్షలు పట్టుబడ్డాయి.  నాచారం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రోడ్డులో ఇన్​స్పెక్టర్​ ప్రభాకర్ రెడ్డి, ఎస్సైలు గంగాధర్ రెడ్డి, సారంగపాణి వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. నాగోల్​కు చెందిన సునీల్ రెడ్డి, శరత్ బాబుతో కలిసి కారులో నాచారం నుంచి భువనగిరి వెళ్లుతున్నారు. వారి కారును పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో వారు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. కారులో ఉన్న ఓ వ్యక్తి భయపడి కారు డోర్​లో స్క్రూలను తీసీ అందులో నగదును రవాణా చేస్తున్నట్లు చెప్పాడు. నగదును స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఇన్​స్పెక్టర్​ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.