ETV Bharat / state

Houses Shrinking: ఆ నగరానికేమైంది.. మొన్నటిదాకా వరదలు.. ఇప్పుడేమో..!

author img

By

Published : Nov 27, 2021, 7:33 PM IST

తిరుపతి నగరవాసుల్లో కొత్త టెన్షన్ నెలకొంది. వరద ధాటికి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి.. ఇళ్లు బీటలు వారటం(Shrinking Houses in Tirupati) ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీకృష్ణానగర్‌ పరిధిలో సుమారు 18 ఇళ్లు బీటలు(Cracks in houses in Tirupati) వారాయి. రంగంలోకి దిగిన అధికారులు.. చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నారు.

Houses Shrinking in Tirupati
తిరుపతిలో ఇళ్లకు బీటలు

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరద నీరు ముంచెత్తడంతో తిరుపతి(heavy rain in tirupati) శ్రీకృష్ణనగర్​లోని ఇళ్ల గోడలకు బీటలు(Cracks in houses in Tirupati) బారుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు రోజులు తరబడి కాలనీలలో నిల్వ ఉండటంతో పునాదులు(Shrinking Houses in Tirupati) కుంగుతున్నాయి.

శ్రీకృష్ణనగర్​లోని ఎనిమిదో క్రాస్​లో 18 ఇళ్లకు గోడలు పగుల్లిచ్చాయి. మూడంతస్తుల భవనం గోడలు బీటలు(cracks on house walls) బారడంతో కూలిపోయే స్థితికి చేరింది. బీటలు బారిన భవనం సమీపంలోని ఇళ్ల పై పడేందుకు అవకాశం ఉండటంతో ఆ భవనాన్ని కూల్చేందుకు నగరపాలక అధికారులు చర్యలు చేపట్టారు. వరదనీరు(flood effect in tirupati) నిల్వ ఉండటంతో పాటు బలహీనమైన నిర్మాణాలతో భవనాలు కూలిపోయే పరిస్ధితి నెలకొందని అధికారులు తెలిపారు. శ్రీకృష్ణనగర్​లో ఇళ్ల గోడలు పగుళ్ళు వచ్చిన ప్రాంతాన్ని శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డితో పాటు తెదేపా నేతలు పరిశీలించారు. వరదతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడతామని కరుణాకర్ రెడ్డి తెలిపారు.

తిరుపతిలో ఇళ్లకు బీటలు.. ప్రజల్లో ఆందోళన

ప్రత్యక్షమైన నీళ్ల ట్యాంక్..

శుక్రవారం రోజు తిరుపతి శ్రీ కృష్ణానగర్‌లో ఓ వింత చోటుచేసుకుంది. భూమి లోపల పాతిపెట్టిన నీటి ట్యాంక్​ను శుభ్రం చేస్తుండగా భూమి ఉపరితలం పైకి ఎగసి(TANK RAISED FROM GROUND IN TIRUPATI) వచ్చింది. దాదాపు 25 అడుగుల విస్తీర్ణంతో 25 సిమెంట్ ఒరలతో నిర్మించిన నీటి తొట్టె బయటపడటం ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శుభ్రం చేస్తున్న సమయంలో సిమెంటు ఒరలు ఉబికి రావడంతో ఆందోళనకు గురైన మహిళ నీటి తొట్టెలో పడిపోయారు. వెంటనే ఆమెను నిచ్చెన సాయంతో బయటకు తీశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నీరు ప్రవహించడంతో ట్యాంక్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు ఒరలు 18 పైకి ఊబికి వచ్చినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇళ్లకు బీటలు మారటం ఆందోళన(cracks on walls in tirupathi) కలిగిస్తోంది.

వరద దెబ్బకు జనజీవనం అతలాకుతలం

ఇటీవల తిరుపతి, తిరుమలలో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోగా.. రవాణా స్తంభించింది. తిరుమల వెళ్లే రహదారుల్లో కొండ చరియలు విరిగిపడడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నడు లేని తిరుపతి నగరంపై వరుణుడు కుండపోత వర్షం కురిపించాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగరవాసులకు తాజాగా గోడలు బీటలు వారడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ చదవండి

tirupati floods: జలదిగ్బంధంలో తిరుపతి... తిండిలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

Tirupati floods latest news : వరద నీటిలో తిరుపతి.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

GEETHA ARTS donation: తిరుపతిలో వరద బాధితులకు.. 'గీతా ఆర్ట్స్' విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.