ETV Bharat / state

High Court: పిల్లల చదువు, కుటుంబ పోషణ ఎవరు చూస్తారు?

author img

By

Published : Jun 3, 2021, 7:12 PM IST

పఠాన్‌కోట్ వద్ద బాంబులు నిర్వీర్యం చేస్తుండగా తీవ్రంగా గాయపడిన ఎన్ఎస్​జీ కమాండో శ్రీనివాసులు(NSG Commando srinivasulu) కుటుంబ పోషణ, పిల్లల చదువు కోసం ఏం చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు(High Court) ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది.

High Court
హైకోర్టు

2016లో పఠాన్‌కోట్ వద్ద బాంబులు నిర్వీర్యం చేస్తుండగా ఎన్ఎస్​జీ కమాండో శ్రీనివాసులు(NSG Commando srinivasulu) దివ్యాంగుడయ్యారు. శ్రీనివాసులు కుటుంబం దీనావస్థలో ఉందంటూ 2016లో పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. పత్రికల్లో కథనాల ఆధారంగా 2017లో హైకోర్టు(High Court) సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

శ్రీనివాసులుకు 300 చదరపు గజాల స్థలం కేటాయించటంతో పాటు.. ఇంటి నిర్మాణానికి రూ.30 లక్షలు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. శ్రీనివాసులు ఇద్దరు పిల్లల చదువు, కుటుంబ పోషణ కోసం ఏం చేస్తారో రెండు వారాల్లో వివరాలు సమర్పించాలని ఆదేశించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: Suicide: తమ్ముడు సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని.. అక్క ఆత్మహత్య.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.