ETV Bharat / state

'భాజపా దొడ్డి దారుల్లో ప్రభుత్వాలను పడగొడుతోంది'

author img

By

Published : Oct 31, 2022, 12:48 PM IST

Updated : Oct 31, 2022, 1:29 PM IST

harishrai comments in BJP
మంత్రి హరీశ్​రావు

Harish rao comments on BJP: తెరాస ఎమ్మెల్యే ఎర కేసు తరవాత తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. తెరాస, భాజపా నేతలు ఇరువురు ఒకరికి ఒకరు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న కేసీఆర్​ చండూర్​ సభలో భాజపాను విమర్శిస్తే.. అదే రోజు భాజపా నేతలు కిషన్​రెడ్డి, బండి సంజయ్​ ప్రతి విమర్శలు చేశారు. తాజాగా నేడు హరీశ్​రావు భాజపాపై విరుచుకుపడ్డారు.

మంత్రి హరీశ్​రావు మీడియా సమావేశం

Harish rao comments on BJP: అబద్ధాలు మాట్లాడటం భాజపా డీఎన్​ఏగా మారిపోయిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. చండూరులో నిన్న కేసీఆర్‌ సభతో వారి వెన్నులో వణుకు పుట్టిందన్న ఆయన.. అందుకే ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పలేదంటున్న భాజపా నేతలు.. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన మార్గదర్శకాలను చూడాలని చెప్పారు. ప్రభుత్వానికి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా.. రైతుల కోసం వాటన్నింటిని కేసీఆర్‌ తిప్పికొట్టారన్నారు. చేనేతపై జీఎస్టీ అంశంలో తాను సంతకం చేశాననటం పచ్చి అబద్ధమన్న హరీశ్‌.. 2016లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి వెళ్లిన ఈటల రాజేందర్‌ను ఈ అంశం గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు.

భాజపా అడ్డగోలుగా కొనుగోళ్లు చేస్తోంది: భాజపా దొడ్డిదారిన పలు రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతోందని మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. తెరాస ఎమ్మెల్యేలకు రూ.100కోట్లు ఆశ చూపిన గడ్డి పోచలా విసిరికొట్టారని పేర్కొన్నారు. సాక్ష్యాధారాలతో సహా మాట్లాడుతున్నా.. ఎందుకు అబద్ధాన్ని పదేపదే ప్రజలకు చెబుతున్నారన్నారు. భాజపా వివిధ రాష్ట్రాల్లో దొడ్డిదారిన ప్రభుత్వాలను పడగొట్టి, ప్రభుత్వాలను తమ పార్టీలో విలీనం చేసుకోలేదా.. ఇది సబబేనా అని ప్రశ్నించారు. అయితే వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ ఫిర్యాదుపై ఎందుకు ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదన్నారు.

రూ.100 కోట్ల ఆశ చూపినా ఎమ్మెల్యేలు గడ్డిపోచలా చూశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైకాపా ఫిర్యాదుపై ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? భాజపా దొడ్డిదారిన ప్రభుత్వాలను పడగొట్టింది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను విలీనం చేసుకుంది...అది సబబేనా? మోటర్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరేయాలనుకున్నారు. అబద్ధాన్ని పదేపదే ప్రజలకు చెబుతున్నారు. సాక్ష్యాధారాలతో సహా మాట్లాడుతున్నా.. ఓట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడాలా? - హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

మునుగోడు వస్తే చూపిస్తాం: నిన్నటి సభతో భాజపా నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని మంత్రి అన్నారు. కిషన్​రెడ్డి, బండి సంజయ్​ మాట్లాడే మాటలు నకిలీ మాటలు.. వెకిలి చేష్టలు.. వీళ్లు మాట్లాడే మాటలు గల్లీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడరని విమర్శించారు. వీళ్ల స్థాయి ఏంటో దిల్లీ దూతలే చెప్పారని దుయ్యబెట్టారు. 8 ఏళ్లలో ఏం చేశామో.. మునుగోడు వస్తే చూపిస్తామన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్​ భూతాన్ని మిషన్​ భగీరథ ద్వారా తరిమికొట్టిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్‌ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. మేము ఇంత చేస్తే కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టి వారి ప్రాణాలను తీస్తున్నాయని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోవరన్నారు. ఈ మాటలు దిల్లీలోనో, గల్లీలోనో మాట్లాడితే కాదు ప్రజల వద్దకు వెళ్లి అడగండి ఎవరు ఎలాంటి వారో అర్థం అవుతుందన్నారు.

ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టిన ఘనత కేసీఆర్‌ది. నిన్నటి సభతో భాజపా నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌వి నకిలీ మాటలు, వెకిలి చేష్టలు. వీళ్లు మాట్లాడే మాటలు... గల్లీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడరు. నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 8 ఏళ్లలో ఏం చేశామో.. మునుగోడు వస్తే చూపిస్తాం. దిల్లీలోనో, గల్లీలోనో మాట్లాడితే కాదు...ప్రజల వద్దకు వెళ్లి అడగండి. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్‌ ద్వారా లబ్ధి చేకూరింది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ స్థాయి ఏంటో దిల్లీ దూతలే చెప్పారు. - హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

ఈటలను అడిగితే చెబుతారుగా: చేనేతపై జీఎస్టీ అంశంపై నేనే సంతకం పెట్టానని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు.. 2016లో చేనేత అంశంపై జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమైందన్నారు. అప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న ఈటల రాజేందర్​నే సమావేశానికి వెళ్లారని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. చేనేతపై జీఎస్టీ రాష్ట్ర సర్కారు అభిప్రాయాన్ని ఆయనే కదా చెప్పారన్నారు. ఇప్పుడు మీ పక్కన ఉన్న ఈటలనే దీని గురించి అడగండి.. మీకే తెలుస్తోంది నిజం ఏంటో అని అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 31, 2022, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.