ETV Bharat / state

Tamilisai: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​

author img

By

Published : Jun 1, 2021, 5:31 PM IST

Updated : Jun 1, 2021, 5:46 PM IST

గవర్నర్​ తమిళిసై(Tamilisai) సౌందరరాజన్​ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(State formation day) శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, ప్రభుత్వం, యంత్రాంగం ప్రయత్నాలతో కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి త్వరలోనే గట్టెక్కుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

Governor tamilisai soundararajan
గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(State formation day) సందర్భంగా గవర్నర్ తమిళిసై(Tamilisai) సౌందరరాజన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆరుదశాబ్దాల సుధీర్ఘ చారిత్రక పోరాటం అనంతరం 2014 జూన్ రెండో తేదీన ఏర్పాటయిందన్నారు. సొంత రాష్ట్రం, స్వయం పాలన లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ప్రజలు ఎన్నో ఆందోళనలు, గొప్ప త్యాగాలు చేశారని తమిళిసై గుర్తు చేశారు.

దేశంలోనే అతి తక్కువ వయసున్న రాష్ట్రమైన తెలంగాణ... సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పరంపరతో వేగంగా పురోగతి సాధిస్తూ కొత్త శకాన్ని తీసుకురావడం సంతోషకరమని అన్నారు. నీటిపారుదల, వ్యవసాయం, ఐటీ, వైద్య, ఫార్మా రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, వివిధ సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాలు రాష్ట్రాన్ని ముందువరుసలో నిలిపాయని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ సమష్టి కృషి, నిబద్ధతతో రాష్ట్రం త్వరలో "బంగారు తెలంగాణ" గా మారాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ప్రజలు, ప్రభుత్వం, యంత్రాంగం ప్రయత్నాలతో కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి త్వరలోనే గట్టెక్కుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: Prisoners: జైలు నుంచి వెళ్లలేక ఖైదీల కంటతడి

Last Updated : Jun 1, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.