ETV Bharat / state

భద్రాద్రి రామయ్య కల్యాణానికి గవర్నర్​కు ఆహ్వానం

author img

By

Published : Apr 7, 2019, 5:09 AM IST

Updated : Apr 7, 2019, 6:48 AM IST

భద్రాద్రి రామయ్య ఉత్సవాలకు రావాలని గవర్నర్​కు ఆలయ ఈవో, అర్చకులు ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున ముఖ్యమంత్రికి అధికారికంగా శుభలేఖ ఇవ్వకుండా సమాచారాన్ని మాత్రమే తెలియజేశారు. ఈనెల 14న శ్రీ సీతారాముల కల్యాణం, 15న పట్టాభిషేకం జరగనుంది.

గవర్నర్​కు ఆహ్వానం

ఈనెల 14న భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి రావాలని గవర్నర్​ నరసింహన్​కు ఆలయ అర్చకులు ఆహ్వానం పలికారు. ఈవో తాళ్లూరి రమేశ్​బాబు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకుడు మురళీకృష్ణమాచార్యులు, వేద పండితులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఉగాది సందర్భంగా రాజ్​భవన్​లో ప్రత్యేక పూజలు చేసి నరసింహన్​ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించారు. సీతారాముల కల్యాణ విశేషాలు పొందుపరిచిన రాజ పత్రాన్ని చదివి వినిపించారు. 15న శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

సీఎంకు సమాచారం

ఇలాంటి వేడుకలకు ముఖ్యమంత్రిని పిలవడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున అధికారికంగా శుభలేఖను అందించలేదు. కల్యాణ కార్యక్రమాల సమాచారాన్ని మాత్రమే తెలియజేశారు.

గవర్నర్​కు ఆహ్వానం పలుకుతున్న అర్చకులు

ఇదీ చదవండి : అంధుడైనా సడలని ఆత్మవిశ్వాసం.. ఎందరికో ఆదర్శం

Intro:Hyd_tg_89_04_congress_candidate_mahila_meeting_ab_c18.

md sulthan, 9394450285.

హైదరాబాద్ పాతబస్తీని ఎంఐఎం అధినేత అభివృద్ధి చేయలేదని,చేస్తే తన ముందు చార్మినార్ వద్ద వచ్చి నిరూపించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసిని మీడియా ద్వారా ఛాలెంజ్ చేసిన హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఫెరోజ్ ఖాన్,
నిరూపిస్తే తాను తప్పుకుంటాను అని చెప్పారు,
బోగస్ ఓట్లతో ఎంఐఎం గెలించింది అని,

తాను పాతబస్తీని బంగారు సిటీ గా మారుస్తాను అని,
హైదరాబాద్ బిజిపి అభ్యర్థి డమ్మీ అని,
లీడర్లు తమ పార్టీని వదిలి వెళ్ళిన తమ కార్యకర్తల నుండి లీడర్లను పుట్టిస్తాము,

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీస ఆదాయం కంటే తక్కువ ఆదాయం వచ్చే పేద కుటుంబాలకు ఏడాదికి 72వేలు ఇస్తామని ఫెరోజ్ ఖాన్ ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ ఫలక్ నుమ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహిళ సమావేశంలో అన్నారు, ఈ సమావేశంలో హైదరాబాద్ కాంగ్రెస్ మహిళ నేతలు, మహిళ కార్యకర్తలు ,మహిళ ప్రెసిడెంట్ లు పాల్గొన్నారు,

బైట్.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఫెరోజ్ ఖాన్......


Body:ఫలకనుమ


Conclusion:హైదరాబాద్
Last Updated : Apr 7, 2019, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.