ETV Bharat / state

ఈ-ఆఫీస్​ విధానంతో పౌరులకు వేగంగా సేవలందుతాయి: గవర్నర్​

author img

By

Published : Aug 26, 2020, 7:24 PM IST

ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించడానికి ఈ-ఆఫీస్​, ఈ-గవర్నెన్స్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. పేపర్​లెస్​ విధానంతో చెట్లు కొట్టివేయడం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు.

governer-spoke-on-e-office-policy
ఈ-ఆఫీస్​ విధానంతో పౌరులకు వేగంగా సేవలందుతాయి: గవర్నర్​

ఈ-ఆఫీస్ విధానంతో పౌరులకు వేగంగా సేవలు అందుతాయని.. జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ-ఆఫీస్ విధానం అమలుపై ఐటీ శాఖ అధికారులు గవర్నర్​కు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు.

ప్రభుత్వ పాలనలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థాయిల్లో ఈ-ఆఫీసు పద్ధతి ద్వారా ప్రజలకు సమర్ధమైన సేవలందించాలని... పేపర్ లెస్ విధానంతో చెట్లు కొట్టివేయడం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని వివరించారు. ఈ-ఆఫీస్, ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన చట్టబద్ధమైన సేవలు సులభతరంగా, హక్కుగా పొందుతారని, వారిని సాధికారత వైపు నడిపిస్తుందని తమిళిసై తెలిపారు.

కొవిడ్-19 సంక్షోభం డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని మరింతగా పెంచిందని, డిజిటల్ సాంకేతికత వినియోగంతో పాలన, జీవితాన్ని సులభతరం చేయడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ-ఆఫీస్ పాలనతో విద్యార్ధులకు సమర్ధమైన, సత్వర సేవలందించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు.

ఇవీ చూడండి: డిసెంబర్ నాటికి 85 వేల ఇళ్లు పేదలకు అందజేస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.