ETV Bharat / state

మాంసం విక్రయ దుకాణాలపై జీహెచ్‌ఎంసీ దాడులు

author img

By

Published : Jun 28, 2020, 4:37 PM IST

Updated : Jun 28, 2020, 7:52 PM IST

జీహెచ్ఎంసీ ముద్ర వేయకుండా మాంసం విక్ర‌యిస్తున్న దుకాణాల‌పై బ‌ల్దియా అధికారులు దాడులు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా వధించిన జంతువుల మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ అధికారి అబ్దుల్‌ వఖీల్‌ హెచ్చరించారు.

ghmc officers raids on without ghmc seal meat sales outlets in hyderabad
మాంసం విక్రయ దుకాణాలపై జీహెచ్‌ఎంసీ దాడులు

చట్టవిరుద్ధంగా వధించిన జంతువుల మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ అధికారి అబ్దుల్‌ వఖీల్‌ హెచ్చరించారు. భాగ్యనగరంలో మాంసం దుకాణాల‌పై జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేశారు. నగరంలో జీహెచ్ఎంసీ స్టాంప్ వేయకుండా మాంసం విక్రయిస్తున్న దుకాణాల‌కు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్​లో 695 దుకాణాల‌కు నోటీసులు ఇచ్చిన‌ట్లు జీహెచ్ఎంసీ చీఫ్‌ వెటర్నరీ అధికారి వివరించారు. ఇందులో174 మటన్, 521 బీఫ్ దుకాణాల‌కు నోటీసులు ఇచ్చారు. ఎల్బీనగర్‌ జోన్‌లో 45, చార్మినార్‌లో 104, ఖైర‌తాబాద్ జోన్‌లో 186, శేరిలింగంప‌ల్లి జోన్‌లో 48, సికింద్రాబాద్‌ జోన్‌లో 97, కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో 185 ఉన్నాయి. ఇకపైకూడా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ట్టరిత్యా చ‌ర్యలు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: పీవీకి అభిమానులెక్కువ.. ఘనంగా నిర్వహించండి: కేసీఆర్​

Last Updated : Jun 28, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.