ETV Bharat / state

GHMC ఎర్లీ బర్డ్ ప్లాన్ సక్సెస్.. తొలి వారంలోనే బల్దియాకు భారీ ఆదాయం

author img

By

Published : Apr 9, 2023, 9:39 AM IST

ఆస్తి పన్ను వసూలులో జీహెచ్ఎంసీ మరింత వేగం పెంచింది. ఎర్లీబర్డ్ పథకం పేరిట ఆస్తి పన్నుకు 5 శాతం రాయితీ ఇచ్చింది. ఫలితంగా పన్ను వసూళ్ల రాబడి పెరిగింది. రూ.750 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి వారంలోనే రూ.123 కోట్లు వసూలైంది.

ghmc collects 123 crore rupees in property tax with the scheme of early bird
ఎర్లీబర్డ్​తో భారీగా ఆదాయ పన్ను వసూళ్ల రాబడి

ఆస్తి పన్ను వ‌సూళ్లలో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. ఈ నెలలో ప్రక‌టించిన ఎర్లీబ‌ర్డ్ ఆఫ‌ర్​లో రూ.750 కోట్ల ఆస్తి ప‌న్ను వ‌సూళ్లను ల‌క్ష్యంగా పెట్టుకోగా.. మొద‌టి వారంలోనే రూ.123 కోట్లు రాబ‌ట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎర్లీ బర్డ్ 2023-24 సంవత్సరానికి ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పించే అవకాశాన్ని కల్పించింది. ఈ ఎర్లీబర్డ్ ఆఫర్ ఏప్రిల్ నెలాఖరు వరకు అమలు కానుంది. జోన్లు, సర్కిళ్ల వారీగా ఎంత పన్ను వసూలు చేయాలనే లక్ష్యాన్ని బ‌ల్దియా ఏర్పాటు చేసింది.

ఆస్తి పన్నుకై నిర్దేశం : ఆస్తి పన్ను ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు అధికారులకు ప్రతి నెలా ఎంత వసూలు చేయాలో లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సర పన్ను వసూళ్లపై బల్దియా ప్ర‌ధానంగా దృష్టి సారించింది. ఎర్లీ బర్డ్ పథకం గురించి 13 లక్షల మంది యజమానుల ఫోన్ నంబర్‌లకు ఇప్పటికే సందేశాలు పంపింది. మొత్తం జోన్ల వారీగా టార్గెట్లు ఏర్పాటు చేసింది. ఎల్బీన‌గ‌ర్ జోన్​లో 105.68, చార్మినార్ జోన్​లో 46.43, ఖైర‌తాబాద్ జోన్​లో 201.66, శేరిలింగంప‌ల్లి జోన్​లో 160.3, కూక‌ట్​ప‌ల్లి జోన్​లో 118.97 కోట్లు, సికింద్రాబాద్ జోన్​లో 117.24 కోట్ల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

ట్రేడ్ లైసెన్సులతో ఆదాయం: హైదరాబాద్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్సులపై రూ.95 కోట్లు చిన్నపాటి దుకాణం నుంచి నక్షత్ర హోటళ్ల వరకు ట్రేడ్ లైసెన్సు అవసరం. అయినప్పటికీ ట్రేడ్ లైసెన్సుల జారీలో జీహెచ్ఎంసీ చొరవ చూపలేదని స్పష్టం చేస్తున్నారు. నగరంలో సుమారు 3 లక్షల వాణిజ్య కేటగిరీ విద్యుత్తు కనెక్షన్లు ఉండగా, 2022- 23 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ జారీ చేసిన ట్రేడ్ లైసెన్సులు 1.2లక్షలు మాత్రమే. వ్యాపార సముదాయాలు, ఉత్పత్తులకు లైసెన్సు తీసుకునే మ్యాప్ చైతన్యవంతం చేయలేదని, ఆమ్యాలు తీసుకుని వ్యాపారులకు అండగా నిలుస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. గతంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్సులు అధికంగా వసూలైనప్పటికీ.. అందులో రూ.7 కోట్లు హరితనిధి కింద యజమానుల నుంచి వసూలు చేసినవే. హరిత నిధి, ట్రేడ్ లైసెన్సుల రుసుం కలిపితే రూ.95.93 కోట్లు వసూలైనట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ట్రేడ్ లైసెన్సులతో కూడా భారీగా ఆదాయాన్ని రాబ‌ట్టాల‌ని చూస్తోంది జీహెచ్ఎంసీ.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.