ETV Bharat / state

Hyderabad Tourist Places: పర్యాటక ప్రాంతాల్లో నగరవాసుల సందడి

author img

By

Published : Jan 17, 2022, 5:23 AM IST

Hyderabad Tourist Places: కనుమ పండుగను పురస్కరించుకుని చాలా కుటుంబాలు హైదరాబాద్‌ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో సందడి చేశాయి. చాలా కాలం తర్వాత రోడ్లు ప్రశాంతంగా ఉండడంతో... నగరంలోని సుందర ప్రదేశాలు చూసేందుకు బయటకు తరలివచ్చారు. సొంతూళ్లకు వెళ్లకుండా నగరంలో ఉన్నవారు బయటకు వచ్చి.. పిల్లలతో సరదాగా గడిపారు. మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూనే పండగ వాతావరణాన్ని సంతోషంగా జరుపుకున్నారు.

Tourist
Tourist

Hyderabad Tourist Places: సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే... కనుమ పండుగను హైదరాబాద్​లో ఘనంగా జరుపుకున్నారు. వరుస సెలవులు రావడంతో ఇంట్లో సరదాగా పండుగ చేశాక... నగరంలోని దర్శనీయ ప్రదేశాలకు అనేక కుటుంబాలు తరలివచ్చాయి. ప్రధానంగా నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, తీగలవంతెన, లుంబినీపార్క్, ఇందిరా పార్క్‌, ఎన్టీఆర్ గార్డెన్‌కి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎక్కడ చూసినా... కుటుంబసభ్యులతో ప్రధాన ప్రాంతాలు... సందడిగా మారాయి.

తక్కువ రద్దీ..

చాలా రోజుల తర్వాత... నగరంలోని రోడ్లు ప్రశాంతంగా ఉండడంతో పాటు రహదారులపై రద్దీ తక్కువగా ఉండడంతో బయటకువచ్చినట్లు నగరవాసులు చెప్పారు. సాధారణ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు.. ప్రయాణం చేసేందుకే ఎక్కువ సమయం పట్టేదని తెలిపారు. బయటకు వచ్చిన సమయంలో తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నట్లు చెప్పారు.

పర్యాటకుల సందడి...

ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వద్ద... హుస్సేన్ సాగర్‌లో బోటు షికారుతో పర్యాటకులు సందడి చేశారు. చాలా మంది నగరంలోని అనేక పర్యాటక ప్రదేశాలను చుట్టేశారు. చాలా రోజుల తర్వాత... అన్ని ప్రదేశాలు తిరిగేందుకు అవకాశం వచ్చిందని నగరవాసులు చెబుతున్నారు. రోడ్లు రద్దీగా లేకపోవడం వల్లే చాలా ప్రదేశాలను సందర్శించగలిగామని వివరించారు. కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం సండే ఫన్ డే కార్యక్రమాన్ని రద్దు చేసింది. అయినా ఈ ఆదివారం ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ సహా పలు పర్యాటక ప్రదేశాలు సందర్శకులతో కిటకిటలాడాయి.


ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.