ETV Bharat / state

మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

author img

By

Published : Feb 21, 2020, 5:48 AM IST

Updated : Feb 21, 2020, 6:55 AM IST

మంత్రి పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి బాధితుల సొమ్ముతో బ్యాంకాక్.. గోవాలో జల్సాలు చేసిన నిందితుడు నాగరాజును సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ktr-pa-cheating
మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

నేను కేటీఆర్ సార్..పీఏ తిరుపతి రెడ్డి అని..నా మంచి చెడు చూసుకోండి.. అడ్వాన్స్ పంపించండి అంటూ పలువురికి ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు వసూలు చేసిన నాగరాజును పోలీసులు కటకటాలకు పంపించారు. ఆయన లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధుల పేరుతో నాగరాజు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాడన్న సమాచారంతో ఇన్ స్పెక్టర్ మోహన్ రావు బృందం అతడిని ప్రశ్నిస్తోంది. మరింత లోతైన సమాచారం కోసం నాగరాజు నేరచరిత్రపై వివరాలు తెలుసుకునేందుకు కోర్టు అనుమతితో పోలీసులు విచారణ చేస్తున్నారు. నాగరాజు వ్యవహరంలో హైదరాబాద్ కేంద్రంగా బయో టెక్నాలజీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థకు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యవహారంలో నాగరాజు లీలలు బయటకు వచ్చాయి.

క్లబ్బుల్లో, పబ్బుల్లో జల్సాలు

గతేడాది నవంబర్ లో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి స్కార్పియో వాహనం, ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని మోసం చేయగా వచ్చిన డబ్బుతో నాగరాజు ఒక్కడే జల్సాలు చేశాడని బ్యాంకాక్, గోవాకు వెళ్లే వాడని, అతడి వద్ద ఉన్న విమాన టికెట్​ను పోలీసులు గుర్తించారు. జల్సాల కొరకు నాలుగు నెలల వ్యవధిలో పలుమార్లు బ్యాంకాక్, గోవాకు వెళ్లి పేకాట క్లబ్బులు, పబ్బుల్లో మద్యం సేవించేవాడని పోలీసులు పేర్కొన్నారు.

లక్షల నగదు వసూలు

అక్కడి నుంచి తిరిగి నేరుగా సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లేవాడని పోలీసులు పసిగట్టారు. నాగరాజు మోసాలు చేసేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుని బాధితులకు ఫోన్లు చేసేవాడు. ముఖ్యంగా ఎమ్మెస్ కే ప్రసాద్ పేరు, మంత్రి వ్యక్తిగత పీఏ సహాయకుడిని అంటూ నాగరాజు మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. అదేవిధంగా పలు క్రికెట్ అసోసియేషన్లు, బ్యాంక్ అధికారుల వద్ద లక్షల నగదు వసూలు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కేటీఆర్ పీ.ఏ అంటూ కొత్త అవతారం

ఈ తరుణంలో పోలీసులకు ఎమ్మెస్కే ప్రసాద్ ఫిర్యాదు చేయడం వల్ల నాగరాజును గుంటూరు, విశాఖపట్టణం పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చాక కూడా కేటీఆర్ పీ.ఏను అంటూ కొత్త అవతారం ఎత్తాడు. మంత్రి కేటీ.ఆర్ పీఏ శైలీలోనే ఫోన్లు చేస్తుండడం వల్ల తడబాటు లేకుండా మాట్లాడడం, వ్యక్తి గత సహాయకుడే అని నమ్మి..లక్ష రూపాయలు నాగరాజు ఖాతాలోకి జమచేశారని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

Last Updated : Feb 21, 2020, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.