ETV Bharat / state

ఫిట్​ ఇండియా: ఉపాధ్యాయుల కోసం సైకిల్ ర్యాలీ

author img

By

Published : Dec 11, 2020, 2:04 PM IST

fit india rally at bowenpally in hyderabad
ఫిట్​ ఇండియా: ఉపాధ్యాయుల కోసం సైకిల్ ర్యాలీ

సికింద్రాబాద్​లో ఫిట్​ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ర్యాలీలో 50 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్​లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లాక్ డౌన్ సమయం నుంచి ఇళ్లకే పరిమితమైన పాఠశాల అధ్యాపకులు ఆరోగ్యం కోసం బోయిన్​పల్లి కేంద్రీయ విద్యాలయం నుంచి సుచిత్ర వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ శశింద్రన్ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.

కరోనా కారణంగా పూర్తిగా ఇళ్లకే పరిమితమవడం వల్ల ఫిట్​నెస్​ కోల్పోతున్నామని బోయిన్​పల్లి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అన్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం రోజూ వ్యాయామంతో పాటు యోగా చేయాలని సూచించారు. వ్యాయామంతో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పొందవచ్చని ఆయన అన్నారు. 50 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కాబోయే వరుడి గురించి బయటపెట్టిన రకుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.