ETV Bharat / state

సంజీవయ్య పార్కులో అగ్నిప్రమాదం

author img

By

Published : May 16, 2019, 1:26 AM IST

Updated : May 16, 2019, 7:09 AM IST

పేరుకుపోయిన చెత్త నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడం హైదరాబాద్​ సంజీవయ్య పార్కులో కలకలం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అగ్నిప్రమాదం

పార్కులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని సంజీవయ్య పార్కులో అగ్ని ప్రమాదం సంభవించింది. పేరుకుపోయిన చెత్తకుప్ప నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సందర్శకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. కొన్ని చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రాంగోపాల్​పేట్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సిగరెట్​ తాగి చెత్తకుప్పలో పారేయడం వల్ల జరిగిందా... లేక కావాలని చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు.

ఇదీ చూడండి : భర్త, అత్త వేధింపులకు మహిళ బలవన్మరణం

Intro:Jk_Tg_mbnr_09_15_Chandraghad_yethipothala_pkg_C12
చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో తరుచూ మరమ్మతుల పేరిట జాప్యం,
పదేళ్ల నుంచి ఆయకట్టు రైతుల ఎదురుచూపు.



Body:వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నర్వ మండలం లోని బెక్కర్ పల్లి , నాగిరెడ్డి పల్లి, యాంకి,పెద్ద కడుమూర్,నాగల్ కడుమూర్ గ్రామాల్లోని రైతులకు చంద్రగడ్ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించాలన్నదే లక్ష్యం దీనికోసం ప్రభుత్వం రూ 50 కోట్లు మంజూరు చేసింది ఎత్తిపోతల పనులను మూడు విభాగాలుగా విభజించిన అధికారులు చంద్రఘడ్ ఎత్తిపోతల ద్వారా సుమారు 4వేల 500 ఎకరాలకు సాగునీరందించాలని డిజైన్ ఏర్పాటు చేశారు.
4500 ఎకరాలకు చంద్రాఘడ్ ఆయకట్టు ద్వారా సాగునీరు అందించేందుకు పనులు చేపట్టారు ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రధాన పంప్ హౌస్ నుంచి ఆయా గ్రామాలలో గల ఎత్తిపోతలకు సాగునీరు అందించడానికి అండర్ గ్రౌండ్ పైపులైన్ ద్వారా సాగునీటిని అందించే విధంగా పనులు చేశారు. నీటి విడుదల సమయంలో భూమి లోపలి నుంచి పైపులు పగిలి లీకేజీలు ఏర్పడడంతో సాగునీటిని ఆయా పథకాలకు అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ పథకానికి సంబంధించిన పనులకు ఉపయోగించిన పైపులకు అడుగడుగున లీకేజీలు ఉండటంతో సమస్య జటిలమైంది దీనికిగాను పనులు చేయడం భారం అని భావించిన సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తయ్యాయని చేతులు దులుపుకున్నాడు దీంతో చంద్రఘడ్ ఆయకట్టు రైతులు అసంపూర్తిగా పనులు ఉన్నాయంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో చెల్లించాల్సిన కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన రూపాయలు రెండు కోట్లు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు.దీంతో ఈ పథకం నిర్వహణ ఇటు ఐడిసి, అటు రైతుల మధ్య సయోధ్య కుదరక మరుగున పడింది.చంద్రఘడ్ ఆయకట్టు రైతుల
ఆశలు నెరవేరేలా లేవు. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్న సాగునీరందని పరిస్థితి నెలకొంది, రైతులకు పదేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి నాలుగేళ్లుగా ఈ పథకం నిర్వహణను గాలి వదలడంతో.... పథకం కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ 50 కోట్లు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడింది.పట్టించుకునే వారే లేక లీకేజీ పైపులకు మరమ్మత్తులు సైతం పూర్తి కావడం లేదు.


Conclusion:అమరచింత, నర్వ మండలాలకు చెందిన రైతులు అత్యధికంగా కందులు,వరి,చెరుకు,పండ్ల రకాల తోటలు వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. సాగునీరు అందక, అధిక ఉష్ణోగ్రత వల్ల భూగర్భ జలాలలో నీరు అడుగంటడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి భూమి లోపల పగిలిన పైపులను మరమ్మతులు చేపట్టి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

బైట్స్:
1) హనుమంత్ రెడ్డి బెక్కర్ పల్లి గ్రామ రైతు
2)మధు బెక్కర్ పల్లి గ్రామ రైతు
3)జగన్ రెడ్డి బెక్కర్ పల్లి గ్రామ రైతు
4)అశోక్ రెడ్డి చంద్రఘడ్ గ్రామ రైతు
5)రాజా రెడ్డి నాగల్ కడమూర్ గ్రామ రైతు

9959999069,మక్థల్.
Last Updated : May 16, 2019, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.