ETV Bharat / state

మాకు చదువే రాదు.. పరీక్ష ఎలా రాయాలి: ఆశా కార్యకర్తలు

author img

By

Published : Jan 22, 2023, 3:38 PM IST

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆశా కార్యకర్తలకు ఈరోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం పెడుతున్న పరీక్షలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తమకు చదువు రాకపోయినా పరీక్షలు రాయమంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AP
AP

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆశా కార్యకర్తలకు.. ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్​లో భాగంగా నేడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అసలు ఈ వయసులో పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా తెలియదంటూ కొందరు వృద్ధులు వాపోయారు. మరికొందరికి అసలు రాయటం కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాయకుంటే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయేమోనని వారి పిల్లలను వెంటబెట్టుకుని పరీక్షలు రాసేందుకు వచ్చారు.

ఆశా వర్కర్‌ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తామోనని.. ఇలాంటి పరీక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి అనేక వ్యయప్రయాసలతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1585 మంది హాజరు కాగా.. తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

"మాకు పరీక్షలు పాడేరులో పెట్టారు. కొంత మంది చదువుకోలేదు. కొంత మంది సంతకాలు మాత్రమే పెడతారు. ఇక్కడ పరీక్షలు ఏర్పాటు చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చదువు రాని మేము పరీక్షలు ఏలా రాయలగుతాం." -ఆశా కార్యకర్తలు

మాకు చదువే రాదు.. పరీక్ష ఎలా రాయాలి: ఆశా కార్యకర్తలు

ఇవీ చదవండి: మీ వివాహ బంధాన్ని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా.. అయితే ఓకోర్సు ఉంది.!

సీఎంకు రాత్రి 2 గంటలకు స్టార్ హీరో ఫోన్​.. షారుక్​ ఎవరో తెలియదన్న కొద్ది గంటలకే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.