ETV Bharat / state

బ్యాంకును మోసం చేసిన కేసులో ఆన్​లైన్​లో ఛార్జ్​షీట్

author img

By

Published : May 21, 2020, 11:50 PM IST

రుణం తీసుకుని బ్యాంకును మోసం చేసిన కేసులో ఓ నిందితునిపై ఈడీ అధికారులు ఆన్​లైన్​లో ఛార్జ్​షీట్ దాఖలు చేశారు. తప్పుడు దస్త్రాలు సమర్పించి 44 లక్షలకు పైగా కట్టలేదని ఫెడరల్ బ్యాంకు సీసీఎస్​లో ఫిర్యాదు చేసింది.

ed officers Online charge sheet in bank fraud
బ్యాంకును మోసం చేసిన కేసులో ఆన్​లైన్​లో ఛార్జ్​షీట్

బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడిపై ఈడీ అధికారులు ఆన్​లైన్​లో ఛార్జ్​షీట్ దాఖలు చేశారు. మల్లిక బార్ అండ్ రెస్టారెంట్ యజమాని లింగాల శ్రీనివాస్ గౌడ్​పై నాంపల్లి కోర్టులో ఎన్​ఫోర్స్ మెంట్ ఆన్​లైన్​లో ఛార్జ్​షీట్​ను సమర్పించింది.

తప్పుడు దస్త్రాలు సమర్పించి 44 లక్షల 80 వేల రూపాయలు రుణం తీసుకుని మోసం చేశారని ఫెడరల్ బ్యాంకు గతంలో హైదరాబాద్ సీసీఎస్​లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన సీసీఎస్.. లింగాల శ్రీనివాస్ గౌడ్ మోసపూరితంగా రుణాలు పొంది బార్ అండ్ రెస్టారెంట్​కు మళ్లించినట్లు తేల్చింది.

నష్టాలు రావడం వల్ల బార్ అండ్ రెస్టారెంట్​ను మూసివేసి రుణం ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది. సీసీఎస్ అభియోగపత్రం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ... మనీలాండరింగ్ అభియోగాలతో నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఛార్జ్​షీట్ దాఖలు చేసింది.

ఇదీ చూడండి : కరోనాతో మృతిచెందిన కానిస్టేబుల్​కు డీజీపీ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.