దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. అరుణ్‌ పిళ్లైకు వారం రోజుల ఈడీ కస్టడీ

author img

By

Published : Mar 7, 2023, 12:52 PM IST

Updated : Mar 7, 2023, 5:06 PM IST

delhi liquior case

Delhi Liquor Scam Case Updates: అరుణ్ పిళ్లైని రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజులు ఈడీ కస్టడీకి పంపింది. మార్చి 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ.. కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ 11 మందిని కటకటాల్లోకి నెట్టింది.

Delhi Liquor Scam Case Updates: అరుణ్ రామచంద్ర పిళ్లైని రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది. మార్చి 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ వాదనతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు, కస్టడీలో తన తల్లితో ఫోన్లో మాట్లాడేందుకు అరుణ్ పిళ్లైకి అనుమతి ఇచ్చింది. ప్రతి రోజు కస్టడీలో ఉన్న పిళ్లైని కలిసేందుకు అతని భార్య, బావమరిదికి కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు హైపో థైరాయిడిజం మందులు, వెన్ను నొప్పికి బెల్ట్​కి అనుమతినిచ్చింది. పిళ్లై విచారణ అంతా... వీడియో రికార్డు చేయాలని ఈడీకి ఆదేశాలు పంపింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ అక్రమ మద్యం కుంభకోణం కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రోజురోజుకూ ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మందిని అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న హైదరాబాద్​కు చెందిన రామచంద్ర పిళ్లైని సోమవారం రాత్రి 11 గంటలకు అరెస్ట్​ చేసింది. ఇటీవలే రెండు రోజుల పాటు రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి అరెస్ట్​ చేశారు.

Delhi Liquor Scam Latest Updates: రాబిన్​ డిస్టిలరీస్​ పేరుతో రామచంద్ర పిళ్లై వ్యాపారం నిర్వహిస్తుంటాడు. దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో సీబీఐ ఇతడిని నిందితునిగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అతని వ్యాపార సముదాయాలు, ఇతర నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ రెండుసార్లు సోదాలు నిర్వహించింది. ఆ సోదాలలో దొరికిన వివరాల ఆధారంగా ఇటీవల రెండు రోజుల పాటు ఈడీ రామచంద్ర పిళ్లైని ప్రశ్నించింది.

రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో ఇతనికి గల సంబంధాలపై ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఇతనిని రామచంద్ర పిళ్లైను ఈడీ అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు ముందు సీబీఐ నమోదు చేసిన కేసులో రౌస్​ అవెన్యూ ప్రత్యేక కోర్టు రామచంద్ర పిళ్లైకు ముందస్తుగా బెయిల్​ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

నేడు సిసోదియాను ప్రశ్నించనున్న ఈడీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్​ అయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాను ఇవాళ ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే ఈ కేసులో తొలిసారిగా ఈడీ అధికారులు సిసోదియాను ప్రశ్నించనున్నారు.

కవిత మాజీ ఆడిటర్​కు షరతులతో కూడిన బెయిల్​: ఇదిలా ఉంటే.. ఇదే కేసులో అరెస్టయిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్​ గోరంట్ల బుచ్చిబాబు బెయిల్​ పిటిషన్​పై రౌస్​ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ జరిపి బెయిల్​ను మంజూరు చేసింది. ఈ బెయిల్​ మాత్రం నిబంధనలతో కూడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్​ ఇవ్వడానికి రూ.2 లక్షల పూచీకత్తు.. పాస్​పోర్టును జమ చేయాలని చెప్పింది. తాజాగా జ్యుడీషియల్​ కస్టడీని కోరుతూ.. సీబీఐ కోర్టును అనుమతి కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు 14 రోజుల కస్టడీని పొడిగించడం జరిగింది.

ఇవీ చదవండి:

Last Updated :Mar 7, 2023, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.