ETV Bharat / state

అన్నదాతలకు గుడ్ న్యూస్ - రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 10:26 PM IST

Updated : Nov 25, 2023, 7:06 AM IST

rythu bandhu
rythu bandhu

22:22 November 24

రైతుబంధు చెల్లింపులకు ఈసీ అనుమతి

EC Allowed for Rythu Bandhu Payments : రాష్ట్రంలో యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు (Telangana Rythu Bandhu 2023) పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతి ఇచ్చింది. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు 5న సీఈసీ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5,000 ల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10,000 లను అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

ECI Approves Distribution of Rythu Bandhu : తెలంగాణలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌ ఆరంభానికి ముందు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో.. రాష్ట్ర సర్కార్‌ నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని.. యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఎన్నికల సంఘాన్ని కోరుతూ లేఖ రాసింది. పరిశీలించిన ఈసీ తాజాగా నిధుల జమకు అనుమతులు ఇచ్చింది.

Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల​.. రైతుల ఖాతాల్లో జమ

28 సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తుండగా.. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్‌ ముగిసే వరకు నిధులను జమ చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ అనుమతించడంతో ప్రభుత్వం 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో నేటి నుంచి సొమ్ము జమ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ మొత్తం రూ.7,700 కోట్లకు పైగా ఉంటుంది.

మంత్రి కేటీఆర్‌ హర్షం : రైతుబంధు(Rythu Bandhu) సాయం విడుదలకు ఎన్నికల సంఘం అనుమతించడంపై బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగుల కరవుభత్యం (డీఏ) విడుదలకు కూడా అనుమతించాలని ఆయన కోరారు.

Rythu Bandhu Funds Releasing Today : నేటి నుంచి కర్షకుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ

మరోవైపు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపు విషయమై ఎన్నికల సంఘానికి.. రాష్ట్ర సర్కార్‌ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. వివిధ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. వాటిపై వివరణలు కోరిన సీఈసీ.. ఇంకా అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2022 జులై ఒకటో తేదీ నుంచి మూడు డీఏలు ఇవ్వాల్సి ఉందని, ఒక డీఏ చెల్లింపునకు అనుమతి ఇవ్వాలని అందులో కోరింది.

రైతుబంధు, డీఏ చెల్లింపుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాం : సీఈవో

రైతు బంధు, డీఏ చెల్లింపులకు సీఈసీ అనుమతి కోరిన సర్కార్

Last Updated : Nov 25, 2023, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.