ETV Bharat / state

మరోసారి తెరపైకి దిల్లీ లిక్కర్ స్కామ్ - తన అరెస్టు చట్టబద్ధతను సవాల్​ చేస్తూ సుప్రీంకు అభిషేక్​ బోయినపల్లి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 12:24 PM IST

Delhi Liquor Scam Case updates
Delhi Liquor Scam Case

Delhi Liquor Scam Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్​ బోయినపల్లి తన అరెస్టు చట్టబద్ధతను సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్​ఏ సెక్షన్​ 19ను పరిగణనలోకి తీసుకోకుండా తనను అరెస్ట్​ చేశారంటూ పిటిషన్​లో పేర్కొన్నారు. అభిషేక్​ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈడీని ఆదేశించింది.

Delhi Liquor Scam Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసు మనీలాండరింగ్ వ్యవహారంలో గతేడాది అరెస్టైన అభిషేక్ బోయినపల్లి.. తన అరెస్టు చట్టబద్ధతను సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్​ను కొట్టివేయడంతో.. సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. వాదనల సందర్భంగా పీఎంఎల్​ఏ సెక్షన్​ 19 పరిగణనలోకి తీసుకోకుండా అభిషేక్​ను అరెస్ట్​ చేశారని ఆయన తరఫు న్యాయవాది ముకుల్​ రోహత్గి పేర్కొన్నారు. సీబీఐ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత.. ఈడీ కేసులో అరెస్టు చేశారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Delhi Liquor Scam: చిన్న ఆరోపణతో మొదలై.. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారి..

Delhi Liquor Scam Case Latest Updates : అభిషేక్ బోయినపల్లి లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన సుప్రీం.. ఈడీ కౌంటర్‌కు రిప్లై దాఖలు చేయాలని అభిషేక్ తరఫు న్యాయవాదులకు సూచించింది. ఈ మేరకు తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్​ను వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. రూ.3.85 కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి అభిషేక్‌కు బదిలీ అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

చిన్నగా మొదలై.. పెను దుమారం..: రెండు సంవత్సరాల క్రితం దిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ తతంగంలో.. ఊహించని పరిణామాలు, రోజుకో మలుపులతో గల్లిగల్లీన ప్రకంపనలు సృష్టించింది. ఓ చిన్న ఆరోపణతో మొదలైన ఈ వ్యవహారం.. పెను దుమారమే రేపి, అత్యున్నత స్థాయి నేతల అరెస్టులకు దారితీసింది. వరుస సోదాలు, రోజుల తరబడి విచారణలతో దిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా మంటలు రేపింది. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అరెస్టు, బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ పరిణామాలతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదే కేసులో మనీలాండరింగ్​కు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన హైదరాబాద్​కు చెందిన అభిషేక్​ బోయినపల్లి తన అరెస్ట్​ చట్టబద్ధతపై తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

'అర్వింద్​ కేజ్రీవాల్, సిసోదియాతో కవితకు ఒప్పందం ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.