ETV Bharat / state

CORONA: తగ్గుముఖం పడుతున్న కరోనా.. 0.47% పాజిటివిటీ రేటు

author img

By

Published : Sep 20, 2021, 4:45 AM IST

రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్​ కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్​ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

CORONA: తగ్గుముఖం పడుతున్న కరోనా.. 0.47% పాజిటివిటీ రేటు
CORONA: తగ్గుముఖం పడుతున్న కరోనా.. 0.47% పాజిటివిటీ రేటు

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.47 శాతంగా నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గత నెల(ఆగస్టు) 9 నుంచి ఈ నెల(సెప్టెంబరు) 5 వరకూ కేసుల నమోదును పరిశీలిస్తే రాష్ట్రంలో కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్నట్లుగా వెల్లడైంది. ఈ తేదీల్లో మొత్తంగా 21,46,085 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 10,137 పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లుగా వైద్యఆరోగ్యశాఖ తాజా నివేదికలో పేర్కొంది.

అత్యధికంగా కుమురం భీం జిల్లాలో 1.96 శాతం పాజిటివిటీ రేటు నమోదు కాగా.. నాలుగు జిల్లాల్లో ఒక శాతానికిపైగా.. 29 జిల్లాల్లో అంతకంటే తక్కువగా పాజిటివిటీ రేటు నిర్ధారణ అయింది. నిత్యం సగటున 89,286 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా నివేదికలో ఆరోగ్యశాఖ తెలిపింది. గత నెల 9 నుంచి ఈ నెల 5 వరకూ చేసిన మొత్తం పరీక్షల్లో యాంటీజెన్‌ పరీక్షలు 18,92,352 కాగా.. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు 2,53,733గా నమోదయ్యాయి. మొత్తం పరీక్షల్లో 11.82 శాతం మాత్రమే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 49,359 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో కేవలం 22(0.04 శాతం) మాత్రమే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు, అలాగే నారాయణపేట జిల్లాలో మొత్తంగా 7,563 పరీక్షలు నిర్వహించగా.. ఇందులో కేవలం 11 మాత్రమే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించినట్లుగా నివేదికలో పొందుపర్చారు.

ఇదీ చూడండి: CORONA: రాష్ట్రంలో కొత్తగా 173 కరోనా కేసులు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.