ETV Bharat / state

TPCC: మధుయాష్కీతో దామోదర రాజనర్సింహ భేటీ

author img

By

Published : Jul 18, 2021, 4:51 PM IST

మధుయాష్కీతో దామోదర రాజనర్సింహ భేటీ
మధుయాష్కీతో దామోదర రాజనర్సింహ భేటీ

పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీని మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ కలిశారు. హైదరాబాద్​లోని మధుయాష్కీ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్​ లీగల్‌ సెల్‌ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని పీసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీని ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ కలిశారు. హైదరాబాద్​లోని మధుయాష్కీ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రజావ్యతిరేఖ విధానాలపై పార్టీపరంగా న్యాయ పోరాటం చేసేందుకు బలమైన లీగల్‌ సెల్‌ ఉండాలని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుతం ఉన్న కమిటీలు, పార్టీపరంగా న్యాయస్థానాల్లో ఉన్న కేసుల స్థితిగతులు వారి మధ్య చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వి.హనుమంతరావుతో భేటీ..

మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్​ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో దామోదర రాజనర్సింహ ఇటీవల సమావేశమయ్యారు. అంబర్​పేటలోని వీహెచ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ వ్యవహారాలపై చర్చించారు.

ఇదీ చూడండి: కోవర్టు రాజకీయాలకు ఆద్యుడు కేసీఆర్: దామోదర రాజనర్సింహ

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వల్ల పేదల ఇబ్బందులు, పార్టీలో అంతర్గత విషయాలపై కోర్ కమిటీలో చర్చించాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీని సమావేశ పరచాలని.. ఈ విషయమై వీహెచ్ ఇప్పటికే రాష్ట్ర ఇంఛార్జి కుంతియాతో చర్చించినట్లు ​ తెలిపారు. ఇతర ఇంఛార్జీలతో మాట్లాడి త్వరలో కోర్ కమిటీ సమావేశం జరపాలని కోరుతామని స్పష్టం చేశారు.

పార్టీని బలోపేతం చేసేలా పని చేయాలి..

ఇదిలా ఉండగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేలా పని చేయాలని స్థానిక నాయకులు, ఆ నియోజకవర్గ ఇంఛార్జీలకు దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ విషయమై హుజురాబాద్ స్థానిక నాయకులు, మండల ఇంఛార్జీలతో ఇటీవల గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఆ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై చర్చించినట్లు రాజనర్సింహ తెలిపారు.

ఉప ఎన్నికకు సన్నద్ధం..

మాజీ మంత్రి ఈటల రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్​ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే​ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీగా మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజ నర్సింహను నియమించారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​లను ప్రకటించారు.

సంబంధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.