ETV Bharat / state

అలర్ట్ - దళితబంధు రెండో విడత అప్లికేషన్స్‌ పరిశీలన నిలిపివేత

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 9:34 AM IST

Dalit Bandhu
Dalit Bandhu

Dalit Bandhu Scheme Second Phase : రాష్ట్రంలో దళితబంధు రెండో విడతలో తీసుకున్న అర్జీల పరిష్కార ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు పేర్కొన్నారు. దాదాపు 50,000 దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత వచ్చేవరకు ఎటువంటి నిర్ణయం తీసుకొమని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామని అధికారులు వివరించారు.

Dalit Bandhu Scheme Second Phase : తెలంగాణలో దళితబంధు (Dalit Bandhu) రెండో విడతలో తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ తెలిపింది. దాదాపు 50,000 దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సహాయాన్ని అందించాలా? లేదా? నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శాఖ లేఖ రాసింది.

Consideration of Applications Stopped Dalit Bandhu : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద రాష్ట్రంలో తొలివిడత 38,323 కుటుంబాలకు దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం అప్పటి సర్కార్ రూ.4,441.8 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి అప్పటి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున సహాయంతో యూనిట్లు మంజూరు చేసింది. తొలివిడతలో ఎంపికైన లబ్ధిదారులందరికీ నిధులు వచ్చాయి.

దళితబంధు వాహనాలు అయిదేళ్లు అమ్మలేరు!

రెండో విడతగా నియోజకవర్గానికి 1100 మంది : రెండో విడతగా నియోజకవర్గానికి 1100 మంది చొప్పున (హుజూరాబాద్‌ మినహా) సుమారు 1.30 లక్షల కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని గత సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో కలిపి జిల్లా కలెక్టర్లకు 50,000లకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ వివరాలను కలెక్టర్లు దళితబంధు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. దళితబంధు రెండోవిడత కార్యక్రమంలో పైలట్‌ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి, వారందరికి యూనిట్లు మంజూరు చేశారు.

Dalit Bandhu 2nd Phase : 'ఎమ్మెల్యేలు చెప్పిన వారికే దళితబంధు..' రెండో విడతలోనూ సేమ్​ టు సేమ్

మిగతా నిధుల విడుదలపై నెలకొన్న సందిగ్ధత : రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాల్లోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్థాల రవాణా వాహనాలు ఇచ్చి, వాటిని జలమండలితో అనుసంధానించారు. ఇతర జిల్లాల్లో మరో 238 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసి, తొలివిడత నిధులు ఇచ్చారు. ఈ లబ్ధిదారులకు మిగతా నిధుల విడుదలపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎస్సీ సంక్షేమశాఖ చర్యలు తీసుకోనుంది.

దళిత బంధు నిధుల్లో గోల్‌మాల్‌.. చేతివాటం చూపుతున్న దళారులు

Dalit Bandhu Scheme in Telangana : గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ నియోజకవర్గం, సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రితోపాటు, చింతకాని (మధిర, ఖమ్మం), తిరుమలగిరి (తుంగతుర్తి, సూర్యాపేట), చారకొండ (అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌), నిజాంసాగర్‌ (జుక్కల్‌, కామారెడ్డి) మండలాల్లో పథకాన్ని అమలు చేసింది.

నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేసి, ఒక్కొక్కరికి 10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేసింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేశారు. ఈ క్రమంలోనే ఈ పథకం రెండో విడత సాయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ దఫా ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది.

Dalit Bandhu In Telangana : దళితబంధు రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

Dalit Bandhu in Telangana: 'అణగారిన బతుకుల్లో.. కొత్త కాంతులు నింపుతున్న దళితబంధు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.