ETV Bharat / state

DATA చోరీ కేసులో ఎస్బీఐ, ఫోన్‌పే, ఫేస్‌బుక్‌ సహా పలు కంపెనీలకు నోటీసులు

author img

By

Published : Apr 2, 2023, 7:32 PM IST

data theft case
data theft case

Police Notices to Several Companies in Data Theft Case: దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం వ్యవహారం గుట్టును రట్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు.. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు డేటాను సేకరించిన పలు కంపెనీలకు.. పోలీసులు నోటీసులు జారీచేశారు. ఇందులో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఓటీటీ సంస్థలు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఈ-లెర్నింగ్ సెంటర్లు ఉన్నాయి. మరోవైపు డేటా బయటకు వెళ్లకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించడంపై 20 అంశాలతో కంపెనీలకు లేఖలు పంపేందుకు సైబరాబాద్‌ పోలీసులు సిద్ధమయ్యారు.

Police Notices to Several Companies in Data Theft Case: దేశంలో 66.9 కోట్ల మంది సమచారాన్ని అమ్మకానికి పెట్టినట్టు గుర్తించిన సైబరాబాద్‌ పోలీసులు... ఈ కేసు దర్యాప్తులో దూకుడుగా వెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టు చేసిన హరియాణా ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌.. డేటాను తీసుకున్న సంస్థలపై దృష్టిసారించారు. 'ఇన్‌స్పైర్‌ వెబ్స్‌' పేరుతో వెబ్‌సైట్‌ ద్వారా 66.9 కోట్ల మంది సమాచారం అమ్మకానికి పెట్టగా.. దానిని వాడుకుంటున్న మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, సైబర్ నేరగాళ్లపై పోలీసులు దృష్టిపెట్టారు.

ప్రధానంగా వినయ్‌ భరద్వాజ్‌.. తన వెబ్‌సైట్‌ ఇన్‌స్పైర్‌ వెబ్స్‌లో పొందుపరిచిన సమాచారాన్ని సేకరించిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఓటీటీ సంస్థలకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. అవే కాకుండా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఈ-లెర్నింగ్ సెంటర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న వాటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, యాక్సిస్‌ బ్యాంకులు... టెక్‌ మహీంద్రా వంటి పలు కంపెనీలు ఉన్నాయి.

20అంశాలతో కూడిన లేఖలు రాయాలని నిర్ణయం: బిగ్‌ బాస్కెట్‌, ఫోన్‌పే, ఫేస్‌బుక్‌, పాలసీ బజార్‌ సహా పలు కంపెనీలకు నోటీసులు జారీచేశారు. క్లబ్‌ మహీంద్ర, మాట్రిక్స్‌, అస్ట్యూట్‌ గ్రూప్‌లకు నోటీసులు ఇచ్చాప డేటా లీకేజీకి సంబంధించి వివరణ కోరారు. ఇదే సమయంలో డేటా చౌర్యం కాకుండా.. ప్రజలు, కంపెనీల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని సైబరాబాద్‌ పోలీసులు రూపొందించారు. డేటా బయటకు వెళ్లకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించడంపై.. 20 అంశాలతో కూడిన జాబితాతో కంపెనీలకు లేఖలు పంపాలని వారు నిర్ణయించారు.

ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి..అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని లేఖల్లో సూచించనున్నారు. వినియోగదారులు తమ మొబైల్‌ నెంబర్, ఆధార్‌ కార్డు, ఇతర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. ప్లే స్టోర్‌ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. మొబైల్ సెట్టింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వివరించనున్నారు.

అసలేం జరిగిదంటే: దేశ వ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ చేస్తూ సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబయి, నాగ్‌పూర్‌, దిల్లీలకు చెందిన నిందితులు.. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మందికి చెందిన డేటాను చోరీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. జస్ట్‌ డయల్‌ ద్వారా ఈ డేటా మొత్తాన్ని అక్రమార్కులకు విక్రయిస్తున్నట్లు బయటపడిందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. 3 కోట్ల మందికి చెందిన ఫోన్‌ నంబర్ల డేటా బేస్‌ నిందితుల వద్ద దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి: అంగట్లో సరుకులా పౌరుల వ్యక్తిగత డేటా.. అమ్ముకున్నోడికి అమ్ముకున్నంత..!

'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలతో పాటు.. స్థలం కూడా'..

కాంగ్రెస్​ అవినీతిపై బీజేపీ స్పెషల్​ 'సినిమా'.. మొదటి ఎపిసోడ్​ రిలీజ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.