ETV Bharat / bharat

కాంగ్రెస్​ అవినీతిపై బీజేపీ స్పెషల్​ 'సినిమా'.. మొదటి ఎపిసోడ్​ రిలీజ్!

author img

By

Published : Apr 2, 2023, 4:27 PM IST

Updated : Apr 2, 2023, 4:35 PM IST

కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది. ఆదివారం ఉదయం 'కాంగ్రెస్​ ఫైల్స్​' మొదటి ఎపిసోడ్​ పేరుతో ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. కాంగ్రెస్​ ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించింది.

Congress Files
Congress Files

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తనదైన శైలిలో కాంగ్రెస్​పై దాడికి దిగింది. 70 ఏళ్ల కాంగ్రెస్​ పాలనలో జరిగిన అవినీతిని వివరిస్తూ 'కాంగ్రెస్​ ఫైల్స్​' పేరుతో ఓ వీడియో విడుదల చేసింది. కాంగ్రెస్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని బీజేపీ ట్విట్టర్​ వేదికగా ఆరోపించింది. ప్రస్తుతం విడుదల చేసిన వీడియో జస్ట్​ ట్రైలర్​ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ముందుంది అని తెలిపింది.

అదానీ వ్యవహారం, రాహుల్‌ అనర్హత వంటి అంశాలపై విపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న తరుణంలో.. బీజేపీ పార్టీ.. కాంగ్రెస్​పై ప్రస్తుతం చేస్తున్న దాడిని మరింత ఉద్ధృతం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎంత అవినీతి జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తూ.. ఆదివారం ఉదయం 'కాంగ్రెస్​ ఫైల్స్​' పేరుతో ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ''కాంగ్రెస్‌ ఫైల్స్‌' మొదటి ఎపిసోడ్​లో కాంగ్రెస్‌ పాలనలో అవినీతి, కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగాయో చూడండి' అని బీజేపీ అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్​ చేసింది. దేశంలో కాంగ్రెస్​ ప్రభుత్వం దాదాపు 70 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన అవినీతి కారణంగానే దేశం వెనుకబడి ఉందని వెల్లడించింది.

"కాంగ్రెస్ తన 70 సంవత్సరాల పాలనలో 48,20,69,00,00,000 రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంది. ఆ డబ్బు దేశ భద్రత, అభివృద్ధి వంటి రంగాలకు ఎంతో ఉపయోగపడేది. ఆ డబ్బుతో 24 ఐఎన్​ఎస్​ విక్రాంత్​, 300 రాఫెల్​ జెట్స్​ కొనుగోలు చేయవచ్చు. 1000 మంగళయాన్​ మిషన్‌లను చేపట్టవచ్చు. కాంగ్రెస్​ పాల్పడిన అతినీతి సొమ్మును దేశం భరించాల్సి వచ్చింది. దీని కారణంగా దేశం అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది"
-బీజేపీ

70 ఏళ్లు ఒక ఎత్తైతే.. 2004 నుంచి 2014 వరకు జరిగిన అవినీతి మరో ఎత్తనీ దాన్ని..'లాస్ట్ డికేడ్​'గా పేర్కొంది బీజేపీ. మన్మోహన్​ సింగ్​ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిని అవినీతి అంతా ఇంతా కాదని తెలిపింది. ఆయన కాలంలో జరిగిన అవినీతి వార్తలతో న్యూస్​ పేపర్లు నిండిపోయేవని వీడియో ద్వారా వెల్లడించింది. ఆ దశాబ్ద కాలం ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని వీడియోలో పేర్కొంది.

"బొగ్గు కుంభకోణంలో రూ.1.86 లక్షల కోట్లు, 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో రూ.1.76 లక్షల కోట్లు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కుంభకోణంలో రూ.10 లక్షల కోట్లు, కామన్వెల్త్‌ కుంభకోణంలో రూ.70 వేల కోట్లు, ఇటలీతో హెలికాప్టర్‌ కొనుగోలు ఒప్పందంలో రూ.362 కోట్లు లంచం, రైల్వే బోర్డు ఛైర్మన్.. రూ.12 కోట్లు లంచం తీసుకున్నారు" అంటూ బీజేపీ ఆ వీడియోలో పేర్కొంది.

  • Congress Files के पहले एपिसोड में देखिए, कैसे कांग्रेस राज में एक के बाद एक भ्रष्टाचार और घोटाले हुए… pic.twitter.com/vAZ7BDZtFi

    — BJP (@BJP4India) April 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated : Apr 2, 2023, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.