ETV Bharat / state

ఆయిల్‌పామ్‌ సాగు పట్ల సీఎం కేసీఆర్‌ ఆసక్తిగా ఉన్నారు: సీఎస్‌

author img

By

Published : Jun 15, 2021, 9:46 PM IST

cs review on oil palm Cultivation
ఆయిల్‌పామ్‌ సాగుపై సీఎస్‌ సమీక్ష

సూక్ష్మజ్ఞాన ఉద్దీపక పథకం ద్వారా ఆయిల్‌పామ్ పంట సాగు చేపట్టేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ పంట సాగు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసక్తిగా ఉన్నారన్న ఆయన రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించడం సహా పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ పంట సాగు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ఆసక్తిగా ఉన్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు, రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించడం సహా పలు అంశాలపై ఉన్నతాధికారులతో బీఆర్‌కే భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. పామాయిల్ నర్సరీల ఏర్పాటు, నాణ్యమైన మొలకల దిగుమతి, కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రైవేట్ సంస్థల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో చైతన్యవంతులైన ఆసక్తిగల రైతులు ఉన్నారన్న సోమేశ్ కుమార్‌... సూక్ష్మజ్ఞాన ఉద్దీపక పథకం ద్వారా ఆయిల్‌పామ్ పంట సాగు చేపట్టేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతుల కోసమయ్యే వ్యయం గణనీయంగా తగ్గుతుందని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Kavitha: ఎదురు లేని శక్తిగా తెరాస: ఎమ్మెల్సీ కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.