ETV Bharat / state

నేర నియంత్రణ పద్ధతులు అమలవుతున్నా.. తగ్గని నేరాలు

author img

By

Published : Oct 1, 2020, 6:50 PM IST

దేశంలోని మెట్రో నగరాల్లో నేరాలు నానాటికీ పెరుగుతున్నాయని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్​సీఆర్​బీ) వెల్లడించింది. జాతీయ స్థాయిలో నేరాలు, నియంత్రణ పద్ధతుల గణాంకాలను.. సంస్థ ఏటా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో జరిగిన నేరాల తీరును వివరించింది.

NCRB CRIME REPORT 2020
నేర నియంత్రణ పద్ధతులు అమలవుతున్నా.. తగ్గని నేరాలు

దేశంలోనే అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో నేర నియంత్రణ పద్ధతులను అమలుచేస్తున్నా.. హైదరాబాద్​లో ఏటా నేరాలు పెరుగుతున్నాయని ఎన్​సీఆర్​బీ వెల్లడించింది. మహిళలు, యువతులు, పిల్లలను రక్షించేందుకు షీ టీమ్స్​ నిరంతరం కృషిచేస్తున్నా.. హింసాత్మక ఘటనలు తగ్గడం లేదని స్పష్టం చేసింది.

మూడేళ్ల వ్యవధిలోనే సైబర్​ నేరాలు నాలుగు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈ కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తున్నా.. కోర్టుల్లో విచారణ కొనసాగుతోందని తెలిపింది.

  • మెట్రో నగరాల్లో నేరాలు
నగరం 2018 2019
1దిల్లీ 2,25,977 2,94,653
2కోల్‌కతా 40,757 40,684
3చెన్నై 19,682 19,682
4బెంగళూరు 30,792 27,251
5హైదరాబాద్‌ 14,332 15,333
  • మెట్రో నగరాల్లో మహిళలపై హింస
నగరం 2018 2019
1దిల్లీ 11,724 12,902
2ముంబాయి 6,058 6,519
3కోల్‌కతా 2,176 2,176
4బెంగళూరు 3,427 3,486
5హైదరాబాద్‌ 2,332 2,755
  • మెట్రో నగరాల్లో సైబర్‌ నేరాలు
నగరం 2018 2019
దిల్లీ 107-
ముంబాయి 2,527 -
కోల్‌కతా 32 -
చెన్నై 118 -
బెంగళూరు 10,555 -
హైదరాబాద్‌ 1,379 1,793
  • హైదరాబాద్‌లో మాత్రం 2019లో సైబర్‌ నేరాల గణాంకాలు నమోదయ్యాయి. మిగతా మెట్రో నగరాల్లో గణాంకాలు నమోదు కాలేదు.

ఇవీచూడండి: నేరాలు-ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.