ETV Bharat / bharat

నేరాలు-ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతం

author img

By

Published : Oct 22, 2019, 7:34 PM IST

Updated : Oct 22, 2019, 11:12 PM IST

2017లో తెలుగు రాష్ట్రాల్లో భారీగానే కేసులు నమోదైనట్టు జాతీయ నేర నమోదు విభాగం ప్రకటించింది. ఈ జాబితాలో ఉత్తర్​ప్రదేశ్​ మొదటిస్థానంలో నిలవగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మెట్రో నగరాల్లో దిల్లీ అగ్రస్థానంలో ఉంది.

NCRB-STATES

నేరాలు-ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతం

దేశవ్యాప్తంగా 2017లో నమోదైన కేసుల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతంగా ఉందని జాతీయ నేర నమోదు విభాగం(ఎన్​సీఆర్​బీ) తెలిపింది. క్రైమ్స్​ ఇన్​ ఇండియా-2017 పేరుతో తాజాగా నివేదిక విడుదల చేసింది ఎన్​సీఆర్​సీబీ.

ఈ జాబితాలో 10.1 శాతంతో ఉత్తర్​ప్రదేశ్​ అగ్రస్థానంలో నిలవగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ తరువాతి స్థానంలో ఉన్నాయి. మెట్రో నగరాల్లో 40.4 శాతంతో దిల్లీ టాప్​లో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగానే కేసులు

2017లో దేశం మొత్తం 30,62,579 నేరాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2016లో 29,75,711.. 2015లో 29,49,400గా ఉంది. 2016తో పోలిస్తే 2017లో నేరాల్లో 11శాతం పెరుగుదల ఉంది.

ఇందులో ఒక్క ఉత్తర్​ప్రదేశ్​లోనే సుమారు 3.1లక్షల కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​లో 4.3శాతం అంటే 1,23,336 ఎఫ్​ఐఆర్​లు దాఖలయ్యాయి. తెలంగాణలో 3.9శాతంతో 1,19,858 కేసులు వచ్చాయి.

NCRB-STATES
రాష్ట్రాలు, యూటీ జాబితా

మెట్రో నగరాల్లో దిల్లీ

మెట్రో నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ మొదటి స్థానంలో ఉంది. పరిగణనలోకి తీసుకున్న 19 మెట్రో నగరాల్లోని జాబితాలో దిల్లీలో 40.4శాతంతో 2,13,141 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్​లో 2.7 శాతంతో 14,462 ఎఫ్​ఐఆర్​లు రిజిస్టర్​ అయ్యాయి.

NCRB-STATES
మెట్రో నగరాల జాబితా

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో..

కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే ఎన్​సీఆర్​బీ ఏటా నేరాల రేటును గణిస్తుంది. ఐపీసీతోపాటు స్థానిక, ప్రత్యేక చట్టాలను అనుసరించిన కేసులను లెక్కిస్తుంది. అయితే ఐపీసీని మాత్రమే అధికారిక నేరశిక్షాస్మృతిగా పరిగణిస్తున్నాం.

ఇదీ చూడండి:రేప్​ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్​మెంట్​ థియరీ'

New Delhi, Oct 22 (ANI): Union Minister for Parliamentary Affairs, Coal and Mines, Prahlad Joshi, urged opposition parties to cooperate in winter session. "We have 4 pending Bills in hand and 7-8 more Bills are likely to come. I request the Opposition parties, expecting them to cooperate just like they did in the last session of the Parliament." The winter session of Parliament will commence from November 18 and continue till December 13.

Last Updated : Oct 22, 2019, 11:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.