ETV Bharat / state

పిల్లల కోసం ప్రత్యేక కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ డెస్క్​

author img

By

Published : May 1, 2021, 10:38 PM IST

కరోనా కోరల్లో చిక్కుకున్న పిల్లలు, వైరస్​ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను సంరక్షించేందుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్​కు వెంటనే ఫోన్ చేసి ప్రభుత్వ సహాయాన్ని పొందాలని, సురక్షితంగా ఉండాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ కోరారు.

corona children help desk
పిల్లల కోసం ప్రత్యేక కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ డెస్క్​

కరోనా బారిన పడ్డ పిల్లలను, కరోనా కోరల్లో చిక్కుకొని మరణించిన తల్లిదండ్రుల బిడ్డలను, అనాథాశ్రమాలు, శిశు సంరక్షణ కేంద్రాలలోని చిన్నారులు ఒక వేళ కొవిడ్ బారిన పడితే.. వారిని ఆదుకుని సంరక్షించేందుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

కరోనా కాటు వల్ల తల్లిదండ్రులు, సంరక్షకులు చనిపోయిన వారు 040-23733665 నంబరుకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేస్తే ఆ పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాలకు తరలించి వారి బాగోగులు చూసుకునే బాధ్యత మహిళా శిశు సంక్షేమ శాఖ తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. చిన్నారుల భవిష్యత్ కోసం, భద్రత కోసం, సంరక్షణ కోసం ఈ హెల్ప్ డెస్క్​కు వెంటనే ఫోన్ చేసి ప్రభుత్వ సహాయాన్ని పొందాలని, సురక్షితంగా ఉండాలని మంత్రి కోరారు.

ఇదీ చదవండి: రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.