ETV Bharat / state

SEETHAKKA: కేసీఆర్ పాలనలో పన్నీరు ఎవరికి.. కన్నీరు ఎవరికి?: సీతక్క

author img

By

Published : Aug 27, 2021, 4:18 PM IST

కేసీఆర్​ పాలనలో పన్నీరు ఎవరికి.. కన్నీరు ఎవరికి అంటూ కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. తెరాస ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ఎవ‌రి పాల‌వుతున్నాయ‌ని ఆమె మండిపడ్డారు. త‌న‌కు 600 ఎకరాలు భూమి ఉందని మంత్రే స్వ‌యంగా చెప్పార‌ని, ఆ భూమిలో అసైన్డ్, దళిత, గిరిజనుల భూములు ఎన్ని ఉన్నాయో కూడా బ‌య‌ట పెట్టాల‌ని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు.

SEETHAKKA: కేసీఆర్ పాలనలో పన్నీరు ఎవరికి.. కన్నీరు ఎవరికి?: సీతక్క
SEETHAKKA: కేసీఆర్ పాలనలో పన్నీరు ఎవరికి.. కన్నీరు ఎవరికి?: సీతక్క

తెరాస ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ఎవ‌రి పాల‌వుతున్నాయ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ప్ర‌శ్నించారు. త‌న‌కు 600 ఎక‌రాలు ఉంద‌ని చెప్పిన‌ మంత్రి మల్లారెడ్డి రైతు బంధు పేరు మీద సంవత్సరానికి 60 లక్షలు తీసుకుంటున్నార‌ని ఆమె ఆరోపించారు. గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో రెండు కోట్ల 40 లక్షలు మంత్రి తీసుకున్నార‌ని విమ‌ర్శించారు.

కేసీఆర్ పాలనలో ఎవరికీ పన్నీరు ఎవరికీ కన్నీరు.. అని ఆమె ప్ర‌శ్నించారు. చిన్న అటెండర్ ఉద్యోగి... తల్లిదండ్రులకు పింఛన్​ రద్దు చేశారని.. మంత్రులకు మాత్రం రైతు బంధు కావాలా..? అని నిలదీశారు

సంపన్నులకు సంపదగా మార్చారు..

మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్లు రైతుబంధు పేరుతో సంవత్సరానికి 60 లక్షలు.. నాలుగేళ్లలో రెండున్నర కోట్లు సీఎం కేసీఆర్​ ఆయనకు కట్టబెట్టిండు. రాష్ట్ర ప్రజల కష్టార్జితం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తే.. ఆ ఆదాయాన్ని సంపన్నులకు సంపదగా మార్చారు. పేదోడి తల్లిదండ్రులకు పింఛన్​ ఇవ్వాలంటే ఒకరికి ఇచ్చి మరొకరికి కట్​ చేసిండ్రు. అటెండర్​ తల్లిదండ్రులకు పింఛన్​ ఇవ్వాలంటే మొత్తమే కట్​ చేసిండ్రు. ఎవరికి పన్నీరైంది.. ఎవరికి కన్నీరైంది ఈ కేసీఆర్​ పాలన. -సీతక్క, కాంగ్రెస్​ ఎమ్మెల్యే

SEETHAKKA: కేసీఆర్ పాలనలో పన్నీరు ఎవరికి.. కన్నీరు ఎవరికి?: సీతక్క

చూస్తూ ఊరుకోం: బలరాం నాయక్​

మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి జిల్లా మూడు చింత‌ల‌ప‌ల్లిలో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష చేస్తుంటే.. మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు ఎందుకు పెట్టించార‌ని కేంద్ర మాజీ మంత్రి బ‌ల‌రాం నాయ‌క్ ప్ర‌శ్నించారు. ఆ ఫ్లెక్సీల్లో ఎక్క‌డైనా దళితులకు, గిరిజనులకు ఏమి లబ్ది చేకూర్చారో అందులో పెట్టలేద‌ని ఆరోపించారు. త‌న‌కు 600 ఎకరాలు భూమి ఉందని మంత్రే స్వ‌యంగా చెప్పార‌ని, ఆ భూమిలో అసైన్డ్, దళిత, గిరిజనుల భూములు ఎన్ని ఉన్నాయో కూడా బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మంత్రి మ‌ల్లారెడ్డి ఏ కాగితాలు పెట్టి మెడికల్ కళాశాల తెచ్చుకున్నారో త‌మ‌కు తెలుస‌ని పేర్కొన్నారు. దళిత, గిరిజన దీక్షను మంత్రి మల్లారెడ్డి వ్యతిరేకిస్తున్నారని.. దానికి మూల్యం చెల్లించక తప్పద‌ని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత, స్థాయి మంత్రి మల్లారెడ్డికి లేద‌ని, నోటికొచ్చిన‌ట్లు పీసీసీ అధ్య‌క్షుడిపై మాట్లాడితే చూస్తూ ఊరుకోమ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదీ చదవండి: CM KCR REVIEW: 'గట్టిగా పట్టుబడతా.. చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.