ETV Bharat / state

సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ రాకపోవడం బాధాకరం: జగ్గారెడ్డి

author img

By

Published : Mar 24, 2021, 7:24 PM IST

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి వైద్య కళాశాల మంజూరు కాకపోవడం చాలా బాధాకరమన్నారు. పేదవారికి ఇళ్లస్థలాలు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.

Congress MLA Jagga Reddy comments not given a chance to question on people problems on assembly sessions at gun park in hyderabad
సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ రాకపోవడం బాధాకరం: జగ్గారెడ్డి

సంగారెడ్డి నియోజకవర్గ అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చెప్పే అవకాశం లేకపోవడం చాలా దారుణమన్నారు. అందుకే మూడు రోజులుగా అసెంబ్లీకి వెళ్లలేదని హైదరాబాద్‌లోని గన్ పార్కు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ మంజూరు కాకపోవడం చాలా బాధాకరమని జగ్గారెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో 40 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా.. ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రేపు ఉదయం 9 గంటలకు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: పాలేరు నుంచి బరిలో దిగుతా.. ఖమ్మం నేతలతో షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.