ETV Bharat / state

ఏపీకి కృష్ణాబోర్డు లేఖ రాయనుంది: కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

author img

By

Published : May 16, 2020, 11:32 PM IST

పోతిరెడ్డిపాడు వద్ద సీఆర్పీఎఫ్​ బందోబస్తు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి అభిప్రాయపడ్డారు. పోతిరెడ్డిపాడులో టెలిమెట్రీ పెడితే నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్​, జనగ్​ మంచి స్నేహితులు అయినా అక్కడ టెలిమెట్రీ ఎందుకు పెట్టట్లేదని విశ్వేశ్వర్​ రెడ్డి ప్రశ్నించారు.

congress-leaders-talks-on-pothireddypadu-issue-in-hyderabad
ఏపీకి కృష్ణాబోర్డు లేఖ రాయనుంది: కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 తదుపరి పనులను ఆపాలని కృష్ణా నది బోర్డు ఛైర్మన్‌ను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్​ ఆదేశించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ ఏపీ ప్రభుత్వానికి సోమవారం లేఖ రాయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్​ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

పోతిరెడ్డిపాడు వద్ద సీఆర్పీఎఫ్ బందోబస్తు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో కానీ అందుకే కేసీఆర్​ మాట్లాడడంలేదని ఆక్షేపించారు.

"మా లెక్కల ప్రకారంగా ఏపీ ప్రభుత్వం 250 టీఎంసీల కంటే ఎక్కువ నీరు.. శ్రీశైలం నుంచి లీగల్​గా తీసుకుపోయింది. దాన్ని కొలవడానికి టెలిమెట్రీ సిస్టమ్​ ఉంటుంది. పోతిరెడ్డిపాడులో టెలిమెట్రీ పెడితే.. కాలుస్తారు, పీకేస్తారు, నాశనం చేస్తారు. ఇప్పుడు ఈ క్షణం కూడా ఆ సిస్టమ్​ను పెట్టలేకపోతున్నాం. కేసీఆర్​, జగన్ మంచి మిత్రులైన ఎందుకు టెలిమెట్రీ పెట్టట్లేదు."

- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ

సాగునీటి ప్రాజెక్టులన్నింటి టెండర్లకు గ్లోబల్ టెండర్ పిలవాలని రజత్‌కుమార్‌కు లేఖ రాయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఆపేంతవరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి ప్రసాద్ స్పష్టం చేశారు.

ఏపీకి కృష్ణాబోర్డు లేఖ రాయనుంది: కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

ఇవీ చూడండి: బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.