ETV Bharat / state

తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్‌ - అభ్యర్థులతో సంబంధం లేకుండా తెరవెనుక రాజకీయం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 10:41 AM IST

Updated : Nov 16, 2023, 7:05 AM IST

Congress Focus on Telangana Assembly Elections : తెలంగాణలో ఏఐసీసీ బృందాలు అభ్యర్థులతో సంబంధం లేకుండా.. తెరవెనుక పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసే పనిని చేపట్టాయి. పోల్‌ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా వార్‌ రూమ్‌ ప్రత్యేక బృందాలు.. దాదాపు 80 నియోజకవర్గాల్లో పర్యటించి ఇంటింటికి ఆరు గ్యారెంటీలు, పోలింగ్‌ బూత్ స్థాయికి సంబంధించిన కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.

Congress focus on Telangana assembly elections
Telangana Assembly Elections 2023

తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్‌

Congress Focus on Telangana Assembly Elections : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌(Telangana Congress).. తీవ్రంగా శ్రమిస్తోంది. ఏ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో.. అభ్యర్థులంతా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. పార్టీకి సానుకూల వాతావరణం ఉన్నట్లు చెబుతున్న హస్తం పార్టీ.. అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీని ఎదుర్కొనేందుకు మరింత పటిష్ఠంగా ముందుకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఏ చిన్నపాటి అవకాశం కూడా బీఆర్‌ఎస్‌, బీజేపీకి ఇవ్వరాదన్న భావనతో.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్‌ రూమ్‌లో.. నియోజకవర్గాల వారీగా ప్రచారం, బూత్‌ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం, ఆరు గ్యారెంటీలను (Congress Six Guarantees in Telangana) ఇంటింటికి చేరేట్లు చూడడం తదితర అంశాలను పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 20,000ల లెక్కన ఆరు గ్యారెంటీల కార్డులను 119 నియోజకవర్గాలకు పంపిణీ చేసింది.

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

ఈ గ్యారెంటీ కార్డులు బూత్‌ స్థాయిలో పార్టీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి చేరుతున్నాయా లేదా అన్నదానిపై కూడా.. వార్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉండగా.. తెరవెనుక జరగాల్సిన కార్యక్రమాలను చక్కబెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 60కి పైగా నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలకు చెంది శిక్షణ కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వార్‌ రూమ్‌ యంత్రాంగం పని చేస్తోంది.

Congress Election Campaign in Telangana : ఇప్పటి వరకు దాదాపు డజన్‌ ఏఐసీసీ ప్రత్యేక బృందాలు.. గడిచిన నాలుగైదు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించాయి. పార్టీ అభ్యర్థిని కలవడంతో పాటు, పోలింగ్‌ బూత్ స్థాయి కార్యకర్తలతో సమీక్షలు జరిపినట్లు సమాచారం. తద్వారా ఇప్పటి వరకు వార్‌ రూమ్‌ నుంచి పెట్టిన ప్రత్యేక ప్రయత్నం.. ఏ మేరకు ప్రయోజనకరంగా ఉందనే అంశంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంతకంటే ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఏదైనా ఉందా అన్న దానిపై ముందుకు వెళ్లాలని వార్‌ రూమ్‌ ప్రతినిధులు భావిస్తున్నట్లు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీనే మైలేజీగా వాడుకుంటున్న కాంగ్రెస్, ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ అంటూ వినూత్న ప్రచారం

AICC Leaders Election Campaign in Telangana : తెలంగాణలో ఎన్నికల తేదీలు దగ్గర పడుతుండడంతో.. కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచారం మరింత ఊపందుకోనుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 17 తర్వాత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు.. ఒక్కొక్కరు కనీసం ఏడు రోజులపాటు రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తారని పార్టీ అంచనా వేస్తోంది. ఈ మేరకు పీసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC President Revanth Reddy).. ఈరోజు వరకు ఆయన ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Political Parties Focus on Hyderabad : హైదరాబాద్‌కు అధినేతలు రావాలి ప్రచారం హోరెత్తాలి భాగ్యనగర ఓటర్ల మనసు గెలుచుకోవాలి

Rahul Gandhi Election Campaign in Telangana : ఇప్పటికే ఒక హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్న ఏఐసీసీ.. మరో ఒకట్రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ బహిరంగ సభల్లో పాల్గొనేలా, రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రోడ్‌ షోలు, పాదయాత్రలు ద్వారా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రతి రోజు ఒక్కో అగ్రనేత మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Assembly Elections 2023 : అగ్రనాయకులకు చెంది తాత్కాలిక ప్రణాళికలు సిద్ధం చేసిన తర్వాత.. ఆయా నేతల భద్రతా సిబ్బంది సూచనల మేరకు ప్రచార విధానంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చివర దశకు వస్తుండడంతో.. అక్కడ పని చేస్తున్న ఏఐసీసీ స్థాయి నాయకులను సింహభాగం తెలంగాణకు రప్పించే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

బీఆర్​ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారాలు

Last Updated :Nov 16, 2023, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.