కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీనే మైలేజీగా వాడుకుంటున్న కాంగ్రెస్, ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ అంటూ వినూత్న ప్రచారం

author img

By ETV Bharat Telangana Desk

Published : Nov 2, 2023, 7:46 AM IST

Kaleshwaram Project Damage ATMs in Hyderabad

Telangana Congress Campaign on Kaleshwaram Project Damage : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటుంది. అధికార పార్టీ పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చూపించి ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్​ పార్టీ బీఆర్​ఎస్​ చేసిన వైఫల్యాన్ని, అవినీతిని అస్త్రాలుగా చేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతోంది. ముచ్చటగా మూడోసారి కోసం బీఆర్​ఎస్​.. ఒక్కసారి అవకాశం కోసం కాంగ్రెస్​ పార్టీలు పోటా పోటీగా ప్రచారంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అవినీతి జరిగిందంటూ వినూత్నంగా ప్రచారం చేస్తోంది.

Telangana Congress Campaign on Kaleshwaram Project Damage : కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో వినూత్నమైన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీఆర్​ఎస్​ పార్టీ పది ఏళ్లలో అవినీతికి పాల్పడిందంటూ ప్రచారంలో హోరెత్తిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని.. ప్రచారంలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక కాళేశ్వరం ఏటీఏం(Kaleshwaram ATM)ను ఆవిష్కరించింది. దీన్ని ఉపయోగించుకుని.. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో బీఆర్ఎస్​ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో కాంగ్రెస్​ నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు.

Kaleshwaram Project ATMs in Hyderabad : కాంగ్రెస్​ పార్టీ నాయకులు కేసీఆర్​పై పలు ఆరోపణలు చేస్తూ.. ఎన్నికల్లో ముందుకు సాగుతోంది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణం పేరుతో దోచుకున్నారని.. ఆ ప్రాజెక్ట్​ కేసీఆర్​కు ఏటీఎంలా మారిందంటూ కాంగ్రెస్​ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో కాళేశ్వరం పేరిట ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎంపై కాళేశ్వరం కరప్షన్​ రావు(కేసీఆర్) అని రాసి.. కేసీఆర్​ ఫొటో(KCR Photo on Kaleshwaram ATM)ను అమర్చారు. ఏటీఎం నుంచి రూ.లక్ష కోట్ల నోటు.. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ అంటూ ఏటీఎంపై కాంగ్రెస్​ పార్టీ రాసింది.

Revanth Reddy Speech at Kollapur Public Meeting : 'తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​కి ఒక్క అవకాశం ఇవ్వండి'

Congress Innovative Campaign in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్​ జాతీయ నాయకులు పర్యటన చేసి.. కేసీఆర్​ అవినీతి పాలనపై పలు విమర్శలు చేశారు. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్​ కుంగిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్​ను ఉపయోగించుకుని కేసీఆర్ కుటుంబం నిధులు దోచేసి.. అవినీతికి పాల్పడ్డారని పలు విమర్శలు చేశారు. ఈ బ్యారేజ్​ కుంగిపోవడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రాజెక్ట్​ నిర్మించి కేవలం నాలుగు సంవత్సారాలకే కుంగిపోవడం ఏమిటని కేసీఆర్​పై మండిపడ్డారు. దీంతో పాటు కేసీఆర్ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్​ అగ్ర నాయకులు విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో అని ప్రజలకు వివరిస్తున్నారు.

Congress Party speed up Election Campaign : ఆరు గ్యారెంటీలే ఆపన్న'హస్తం'గా.. కాాంగ్రెస్ ముమ్ముర ప్రచారాలు

Congress National Leaders Comments on KCR : కాంగ్రెస్​ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు బీఆర్​ఎస్​పై చేస్తున్న విమర్శలకు అద్దం పడుతూ ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఏటీఎం.. లక్ష కోట్ల రూపాయల అవినీతిని ఎత్తి చూపేలా.. ఏటీఎం నుంచి లక్ష కోట్ల రూపాయల నోటు బయటకి రావడం ప్రజలందర్ని ఆకర్షిస్తోంది. ఈ ఏటీఎంలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్​ నాయకులు ఏర్పాటు చేశారు. ప్రజలను ఈ ఏటీఎం ఆకర్షించి.. బీఆర్ఎస్​ అవినీతిని తెలుసుకుని.. కాంగ్రెస్​ పార్టీ వైపు తిరుగుతారని కాంగ్రెస్​ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Rahul Gandhi Speech at Kollapur Meeting : 'కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు నిలిచిపోతుందనేది దుష్ప్రచారం.. కౌలు రైతులకూ రైతు భరోసా ఇస్తాం'

Revanth Reddy Challenge to KCR : 'కర్ణాటకలో అమలు అవుతున్న పథకాలు చూసేందుకు సిద్ధమా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.