ETV Bharat / state

మీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలనుకుంటున్నారా?

author img

By

Published : Jun 26, 2020, 2:29 PM IST

దేశ వ్యాప్తంగా లాక్​డౌన్ కారణంగా ఆధార్ అప్​డేట్, నమోదు కేంద్రాలను మూసివేశారు. ఒకవేళ మీ ఆధార్ కార్డులో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ మొదలైన వివరాలను అప్​డేట్ చేయాలనుకుంటే, దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంది. మీ ఆధార్‌లోని వివరాలను అప్​డేట్ చేసుకోడానికి మీరు సమీప కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)ని సందర్శించవచ్చు.

common-service-centre-for-aadhar-update
మీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలనుకుంటున్నారా?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కామన్ సర్వీస్ సెంటర్​కు ఆధార్ అప్​డేట్ సర్వీసులను అందించడానికి అనుమతి ఇచ్చిందని మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ), కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి సంజయ్ ధోత్రే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇలాంటి 20 వేల కామన్ సర్వీస్ సెంటర్లు ఇప్పుడు పౌరులకు ఆధార్ అప్​డేట్ సేవలను అందించగలవని ధోత్రే ట్వీట్ చేశారు.

కామన్ సర్వీస్ సెంటర్ అంటే ఏమిటి?

కామన్ సర్వీస్ సెంటర్లు దేశంలో అవసరమైన ప్రజా వినియోగ సేవల పంపిణీ, సాంఘిక సంక్షేమ పథకాలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, విద్య మొదలైన వాటి యాక్సెస్ పాయింట్లు. https://locator.csccloud.in/ పై క్లిక్ చేయడం ద్వారా ఒక వ్యక్తి సమీప కామన్ సర్వీస్ సెంటర్​ని గుర్తించవచ్చు. మీరు నివసిస్తున్న రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా వివరాలను నమోదు చేయాలి.

సీఎస్సీలో ఆధార్ సంబంధిత సేవలను పొందేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ వివరాలను అప్​డేట్ చేసుకోడానికి మీరు రూ.50 చెల్లించాలి.

ఇదీచూడండి: తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.