ETV Bharat / state

CM KCR Saddula Bathukamma 2023 Greetings : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 8:11 AM IST

Bathukamma 2023
Bathukamma

CM KCR Saddula Bathukamma 2023 Greetings : రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్కపూలతో గౌరమ్మని అలంకరించి పూజించారు. మహిళలంతా ఒకచోట చేరి ఆటపాటలతో అలరించారు. నృత్యాలతో హోరెత్తించారు. ప్రశాంత వాతావరణంలో సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.

CM KCR Saddula Bathukamma 2023 Greetings రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

CM KCR Saddula Bathukamma 2023 Greetings : తెలంగాణవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) జరిగాయి. ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగని.. సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. సబ్బండ వర్గాలు సమష్టిగా జరుపుకునే వేడుకగా పేర్కొన్నారు. నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు.. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వెన్నెపూల బతుకమ్మ సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. లక్డీకపూల్‌లోని కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. ఓయూ కాలేజ్‌ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో.. ఉపాధ్యాయులు, విద్యార్థినులు కోలాటం, దాండియా ఆడారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Bathukamma celebrations in Ireland : ఐర్లాండ్​లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పురపాలికలోని వినాయక గంజిలో బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులంతా ఒక చోట చేరి ఆడిపాడారు. మౌలాలి జడ్‌ఆర్‌టీఐ రైల్వే ట్రైనింగ్ సెంటర్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థలో పనిచేస్తున్న మహిళలతో పాటు ట్రైనీలు కోలాటం, దాండియా ఆడి సందడి చేశారు. ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే ఏకైక సంస్కృతి తెలంగాణకే సొంతమని కొనియాడారు.

MLC Kavitha Participated Bathukamma Celebrations : రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బతుకమ్మ పండుగను అంతా ఆనందంగా చేసుకుంటున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన కవిత పలుచోట్ల మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై ప్రతి ఏటా జరిగే సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

Saddula Bathukamma in Telangana : సద్దుల బతుకమ్మను ఎలా చేస్తారు.. చివరి రోజుకు అంత ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ములుగు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై తంగేడు, సీత జడ, చామంతి, బంతి, అల్లి పువ్వులు దర్శనమిస్తున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోనూ పెద్దఎత్తున సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్‌లో పలుచోట్ల మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని చావిడి వద్ద నిర్వహించిన వేడుకల్లో.. స్పీకర్ పోచారం పాల్గొని మహిళలతో దాండియా ఆడారు. విశిష్టమైన పద్ధతిలో బతుకమ్మలను తయారుచేసిన మహిళలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు.

బీర్కూరులో రకరకాల పువ్వులతో సుమారు 16 అడుగుల ఎత్తుగల బతుకమ్మను తీర్చిదిద్దారు. మందమర్రి ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ మహిళావిభాగం ఆధ్వర్యంలో సంబరాలు ఉత్సాహంగా సాగాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో విభిన్న సంప్రదాయంలో బతుకమ్మ ఆడారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి ఏర్పాటుచేసిన సంబరాల్లో సుమారు 600 మంది మహిళలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

Bathukamma Celebrations 2023 :ఖమ్మంలో టీఎన్‌జీఓ ఆధ్వర్యంలో వెన్నపూస బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో సంబురాలు ఘనంగా జరిగాయి. అనంతరం పట్టణ సమీపంలోని రాయరావు చెరువు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాల్లో బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.

Bathukamma Celebrations At Telangana Secretariat : నూతన సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

MLC Kavitha Bathukamma Video : బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత.. తోటి మహిళలతో కలిసి ఆటాపాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.