సందడిగా ముందస్తు బతుకమ్మ వేడుకలు.. ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు

author img

By

Published : Sep 24, 2022, 9:07 AM IST

Bathukamma festival

Bathukamma Festival in Telangana: రాష్ట్రవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. అమ్మాయిల ఆటపాటలతో విద్యాసంస్థలు కోలాహలంగా మారాయి.

ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు వచ్చేశాయ్​.. ఆటపాటలతో చిన్నారుల నృత్యాలు అదుర్స్​

Bathukamma Festival in Telangana: అందమైన యువతులు.. రంగురంగుల పూలు.. బతుకమ్మ పాటలు.. ఆడపిల్లల నృత్యాలు.. విద్యాసంస్థల్లో కనిపించిన దృశ్యాలివి. బతుకమ్మ పండుగ పురస్కరించుకుని.. కళాశాలలు, పాఠశాలల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలోని ప్రైవేటు పాఠశాలలో.. బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చారు.

యువతల దాండియా నృత్యాలు: పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలకు కోలాట నృత్యాలను ప్రదర్శించారు. జగిత్యాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు పాఠశాలల్లో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు ఆడిపాడారు. హనుమకొండలో ముందస్తు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయులతో కలిసి ఆడిపాడారు.

దివ్యాంగుల ఆట పాటలు: యువతుల దాండియా నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబురాల్లో భాగంగా ఆదిలాబాద్‌లోని భవిత కేంద్రంలో దివ్యాంగుల ఆట పాటలు అలరించాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు సందడిగా సాగాయి. విద్యార్థినిలు డీజే పాటలకు అనుగుణంగా బతుకమ్మ ఆడారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.