రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ

author img

By

Published : Sep 23, 2022, 8:00 PM IST

Bathukamma sarees distribution

Bathukamma sarees distribution: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన... బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయానియోజకవర్గాల్లో... ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆడపడచులకు చీరలు అందజేస్తున్నారు. బతుకమ్మ పండుగను పేద, ధనిక తేడా లేకుండా సంతోషంగా జరుపుకోవడానికే చీరల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

Bathukamma sarees distribution: రాష్ట్ర సంస్కతి సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేప్టటింది. ఇప్పటికే వేడుకలు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న సర్కారు... ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి చీరల పంపిణి చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ నేడు విశ్వవ్యాప్తంగా జరువుకోవటం అందరికీ గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో మంత్రి బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. దేశానికి సారథిగా కేసీఆర్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్‌ జిల్లాలో జరిగిన పలు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెరాస ప్రజలతోనే ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్రంలో... 22లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన భాజపా.. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని కవిత ప్రశ్నించారు. ఉద్యోగ ప్రకటన కోసం ఎంపీలు, ప్రధానిని నిలదీయాలన్నారు. కొందరు ప్రజలను విడగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారన్న ఆమె.. వారికి గట్టిగా సమాధానం చెప్పాలని సూచించారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పసునూరి దయాకర్ తో కలసి ఎమ్మేల్యే ఆరూరి రమేష్ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేశారు. మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం ఇటిక్యాలలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దివాకర్ రావు చీరల పంపిణీ జరిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు చీరల పంపిణీ జరిపారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.