ETV Bharat / state

CM KCR REVIEW: కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: కేసీఆర్

author img

By

Published : Aug 7, 2021, 3:10 PM IST

Updated : Aug 7, 2021, 5:41 PM IST

CM KCR REVIEW: కాసేపట్లో నీటిపారుదల అంశాలపై సీఎం కేసీఆర్​ సమీక్ష
CM KCR REVIEW: కాసేపట్లో నీటిపారుదల అంశాలపై సీఎం కేసీఆర్​ సమీక్ష

నీటిపారుదల అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇంజినీర్లు, అధికారులతో కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్​తో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నీటిపారుదల అంశాలపై ఇంజినీర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్​తో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్​, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, అంతర్రాష్ట్ర విభాగం ఇంజినీర్లు పాల్గొన్నారు.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో త్వరలో జరగబోయే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇవాళ మరోమారు ఆ అంశంపై సమీక్ష చేపట్టారు. కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి చర్చించారు.

శుక్రవారం జరిగిన సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో త్వరలో జరగబోయే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సాగునీటి హక్కుల కోసం, వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగువేసే ప్రసక్తే లేదని, ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి హక్కుగా కేటాయించిన న్యాయమైన నీటి వాటాలకు సంబంధించి బచావత్‌, బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునళ్ల తీర్పులను మరోసారి సమీక్షించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు నదుల్లో ఉభయ రాష్ట్రాలకు ఉండే నీటి వాటాలపై విస్తృతంగా చర్చించారు. ఆదివారం కూడా చర్చను కొనసాగించాలని నిర్ణయించారు.

ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్​ పదే పదే అధికారులకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి: 4 గంటలకు సచివాలయ పనులను పరిశీలించనున్న కేసీఆర్

Last Updated :Aug 7, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.