ETV Bharat / state

ఈనెల 27న కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష

author img

By

Published : May 25, 2020, 9:54 PM IST

Updated : May 25, 2020, 11:19 PM IST

ఈనెల 27న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. లాక్​డౌన్​పై భవిష్యత్​ నిర్ణయం, వానాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

kcr
kcr

కరోనా, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై చర్చిస్తారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు.

ప్రస్తుతం హైదరాబాద్​లో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరి కొంత కాలం ఇలాగే కొనసాగించాలా ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.

గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా లేదా, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలపై సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయం కూడా చర్చిస్తారు.

ఇదీ చూడండి: మరో 3 రోజులు తప్పని భానుడి భగభగలు

Last Updated : May 25, 2020, 11:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.