ETV Bharat / state

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్​ సమావేశం

author img

By

Published : Jun 18, 2021, 6:30 PM IST

సీఎం కేసీఆర్(CM KCR)​ మంత్రులతో అత్యవసర సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్​తో భేటీ అయ్యారు.

cm, kcr
సీఎం, కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులతో సీఎం ప్రగతిభవన్​లో భేటీ అయ్యారు.

లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ సహా వివిధ అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టులు, కృష్ణా జలాలు, ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులు సహా ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలిసింది. లాక్​డౌన్​ పొడగించాలా లేక రాత్రి పూట కర్ఫ్యూ అన్న దానిపై మంత్రుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టటంతో లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Ts Lockdown: రాష్ట్రంలో లాక్​డౌన్ ఇక ఉండదా? అయితే వాట్ నెక్స్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.