ETV Bharat / state

ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందాం: కేసీఆర్‌

author img

By

Published : Apr 12, 2023, 8:06 PM IST

CM Kcr Comments at Iftar Dinner in LB Stadium: ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన విందులో సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.

CM Kcr
CM Kcr

CM Kcr Comments at Iftar Dinner in LB Stadium: దేశం సరైన నాయకుడు, పార్టీ కోసం ఎదురుచూస్తోందని ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదని... గంగజమునా తెహజీబ్‌ సంస్కృతిని కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో దావత్ ఏ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

కేంద్రంలోని ప్రభుత్వం.. రాష్ట్రప్రభుత్వం తరహాలో సమర్థంగా పనిచేసి ఉంటే... తెలంగాణ జీఎస్​డీపీ మరింత ప్రగతిలో ఉండేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం 9ఏళ్లలోనే 12వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో దేశంలో అగ్రగ్రామిగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు పూర్తిగా నివారించామని తెలిపిన సీఎం కేసీఆర్... నిరుద్యోగం కూడా తగ్గినట్లు తెలిపారు.

ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందాం : దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని... ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో బీఆర్​ఎస్​కు ఘన స్వాగతం లభించిందన్న కేసీఆర్.. నడిపించే సరైన నేత కోసం దేశం ఎదురుచూస్తోందన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.

'దేశంలో ఈ రోజు ఒక వింతపోకడలో పయనిస్తోందనే విషయం అందరికీ తెలుసు. భారత్‌ మనందరిదీ ఎలాంటి పరిస్థితులైనా కాపాడుకోవాలి. చిన్నచిన్న అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. ఇందుకోసంచివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతూనే ఉంటా. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. మన దేశ వారసత్వమైన గంగా జమునా తెహజీబ్‌ను ఎవరూ మార్చలేరు. ఎవరైనా మార్చాలనే ప్రయత్నిస్తే వారే అంతమవుతారు. దేశం మాత్రం అంతం కాదు. ఈ విషయంలో నాపై విశ్వాసం ఉంచండి. దేశం ఓ సరైన నాయకుడు, పార్టీ కోసం ఎదురుచూస్తోంది. ఇందుకోసం ముందుకెళ్లి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశాన్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం.'- సీఎం కేసీఆర్

కేసీఆర్‌తో పాటు విందుకు మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందాం: కేసీఆర్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.